BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
తొక్కిసలాట ఎందుకు జరిగింది? ఎలా జరిగింది?
''జనం భారీగా వస్తారని మేం అంచనా వేశాం. అయితే రెండు రైళ్లు ఆలస్యంగా నడవడంతో అనుకున్న కంటే ఎక్కువ మంది అక్కడకు చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. తొక్కిసలాటకు కారణాలపై రైల్వే శాఖ దర్యాప్తు చేస్తోంది'' అని రైల్వే డీసీపీ కేపీఎస్ మల్హోత్రా చెప్పారు.
‘26 ఏళ్లుగా ఈ స్టేషన్‌కు వస్తున్నాను, ఇంత జనాన్ని ఎన్నడూ చూడలేదు’
‘‘రైలు రావడం గమనించిన వెంటనే ఇంకో ప్లాట్‌ఫామ్‌పై నుంచి కూడా జనం ఇక్కడకు వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. చాలా మంది పైన కూడా నిల్చుని ఉన్నారు. జనసమూహం చాలా పెద్దదిగా ఉంది. పోలీసులు అంతా చూశారు కానీ జనాలను నియంత్రించలేకపోయారు’’ అని రవి చెప్పారు.
న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.. 18 మంది మృతి
రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి విపరీతమైన రద్దీ ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు 'బీబీసీ'తో చెప్పారు. కుంభమేళాకు వెళ్లివస్తున్న ప్రయాణికులతో స్టేషన్ కిక్కిరిసిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
అమెరికా నుంచి భారతీయ అక్రమ వలసదారులతో వస్తున్న విమానాలు పంజాబ్‌లోనే దించడంపై విమర్శలు ఎందుకు?
"విమానంలో ముగ్గురు హరియాణాకు చెందినవారున్నారు, అలాంటప్పుడు అంబాలాలో ఎందుకు దిగడంలేదు. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ రాగానే అంబాలాలో దింపుతారు. మేం చిన్న పిల్లలం అనుకుంటున్నారా?" అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.
క్రికెట్లో పురుషులతో పోల్చితే మహిళలకు వేతనాల్లో తేడా ఎందుకు?
డబ్ల్యూపీఎల్‌లో మహిళా క్రికెటర్లు పొందే డబ్బుకు, ఐపీఎల్లో పురుష క్రికెటర్లు పొందే డబ్బుకు చాలా వ్యత్యాసం ఉంది. ఇరు టోర్నీల్లో ఫ్రాంచైజీ యజమానులు చెల్లించే వేలం డబ్బుపైనే ఆటగాళ్లకు వచ్చే వేతనం ఆధారపడి ఉంటుంది. మరి ఎందుకీ తేడా?.
అసహజ లైంగిక దాడి చేసి భార్య మరణానికి కారకుడైన వ్యక్తిని నిర్దోషిగా వదిలేసిన హైకోర్టు, ఈ తీర్పుపై ఆగ్రహం, ఆందోళనలు ఎందుకు?
కోర్టు పత్రాలు చదవడానికి కూడా భయం పుట్టించేలా ఉన్నాయి. ప్రాసిక్యూషన్ ప్రకారం, ఈ సంఘటన 2017 డిసెంబర్ 11 రాత్రి జరిగింది. డ్రైవర్‌గా పని చేసే భర్త "భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెతో అసహజంగా లైంగిక దాడి చేశారు. దీని వల్ల ఆమె చాలా బాధను అనుభవించారు."
మోదీ- ట్రంప్ చర్చలు: ఐదు కీలక అంశాలు ఇవే...
చాలా అరుదైన సందర్భం ఇది. ప్రధానమంత్రి మోదీ ట్రంప్‌తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆయన రెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో ఒకటి అక్రమ వలసలు. మరొకటి అదానీ గ్రూప్‌పై అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చేసిన లంచం ఆరోపణలకు సంబంధించినది.
పని మనుషులపై అఘాయిత్యాలను నిరోధించే చట్టాలు భారత్‌లో ఎందుకు లేవు?
''ఇంటి పనిని నైపుణ్యం లేని పనిగా పరిగణిస్తారు. కానీ, వాస్తవంలో అలా ఉండదు. నైపుణ్యాలు లేకుండా మీరు అనారోగ్యంతో ఉన్నవ్యక్తిని చూసుకోలేరు, వంట చేయలేరు''
బీబీసీ న్యూస్‌రూమ్‌లో ప్రవేశించేందుకు అరుదైన అవకాశం.. అనుభూతి చెందండి
బీబీసీ న్యూస్ వరల్డ్ సర్వీస్ 40 భాషల్లో వారానికి 31 కోట్ల 80 లక్షల మందిని చేరుతోంది. గత వందేళ్లుగా ప్రజలు బీబీసీ స్వతంత్ర జర్నలిజం, నిజాయితీపై నమ్మకం ఉంచారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
జాతీయం
ఫీచర్లు
చార్లెస్ శోభరాజ్: జైలు సిబ్బందికి మత్తు మాత్రలు ఇచ్చి తప్పించుకున్న ఈయన ఇప్పుడు ఎక్కడున్నారు?
ఏఎస్సీ నియామక పత్రంతో తీహార్ జైలుకు వచ్చిన సునీల్‌కు... ఇక్కడ అలాంటి ఉద్యోగాలు లేవని చెప్పడంతో షాక్‌కు గురయ్యారు. కానీ ఓ వ్యక్తి గంటలో అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించాడు. ఆ ఆర్డర్ ఇప్పించింది జైలుశిక్ష అనుభవిస్తున్న చార్లెస్ శోభరాజ్. తీహార్ జైలులో చార్లెస్ రాజ్యం ఎలా నడిచిందో చెప్పడానికి ఇదో ఉదాహరణ.
కుంభమేళాలో సాధువులు, తెలుగు అమ్మాయిలు, రుద్రాక్షలు.. బీబీసీ కెమెరా కంటితో మీరూ చూసేయండి
వసంతి పంచమి ఒక్కరోజే మొత్తం 2.33 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది.
త్రివేణి సంగమం: తెలుగురాష్ట్రాల్లో ఈ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి,ఏయే నదులు కలుస్తాయి?
సాధారణంగా రెండు నదులు కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు. అదే మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం అంటారు. సంగమ స్నానాన్ని, ముఖ్యంగా త్రివేణి సంగమ స్నానాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తుంటారు.
ఒక ఇంజినీర్ ట్రైన్ మిస్ కావడం వల్ల ఇంత పెద్ద ఆవిష్కరణ సాధ్యమైందని తెలుసా?
1879లో సర్ శాన్ఫోర్డ్ ఫ్లెమింగ్ రైలును మిస్ అయ్యారు. కెనడాలో రైలు ఇంజనీర్ అయిన ఫ్లెమింగ్‌కు ఒక ఆలోచన వచ్చింది. అదే టైమ్ జోన్. 1883 నవంబర్ 18న అమెరికా, కెనడాల్లోని రైలు పరిశ్రమలు ఫ్లెమింగ్ ప్రతిపాదనను ఆమోదించాయి.
పాకిస్తాన్: రెండేళ్లపాటు పతాక శీర్షికలకెక్కిన ఆమె పేరు చనిపోయిన రోజు ఎందుకు కనిపించలేదు, అత్యంత మిస్టరీ మరణంలో ఆమె పాత్ర ఏంటి?
ఆ సమయంలో తూర్పు పాకిస్తాన్ వేరు పడి బంగ్లాదేశ్ అయింది. అయినప్పటికీ షెహనాజ్ ఎల్లప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలిచేవారు. డాన్‌తో పాటు ఇతర సాయంకాలం పత్రికలు షెహనాజ్ సెక్స్ లైఫ్ గురించి వార్తలు రాసేవి. ఆమెకు సంబంధించినప్రతి విషయం పత్రికల్లో వచ్చేది. దీనివల్ల పిల్లలు వార్తాపత్రికలు చదవకూడదని ప్రజలు పేపర్లను వేయించుకోవడం మానేశారు.
అంతర్జాతీయం
ఆరోగ్యం
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.







































