ఇది సరికొత్త ప్రేమ ఫార్ములా

ఫొటో సోర్స్, iStock
ఫేస్బుక్.. టిండర్.. ఓకే కుపిడ్.. ఇలా రకరకాల వేదికల్లో డ్రీమ్ పార్ట్నర్ కోసం వెదుకుతున్నారా? అయితే అక్కడ అందమైన ఫొటోలు ఉన్న వారి వెంట పడవద్దని అంటున్నారు రచయిత హన్నా ఫ్రై.
ఎందుకంటే.. అందమైన ఫొటోలున్నవారికి ఎక్కువ ప్రేమ అభ్యర్థనలు వెళ్తాయట. దీంతో వారు చాలా వాటిని పక్కన పెట్టేస్తారు.
మీరు ఎక్స్టార్డనరీ అయితే తప్ప అవతలివారు మీ ప్రేమలో పడే అవకాశం లేదు.
అందుకే లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తున్నవారిని ఎంచుకుంటే సరి.
ఫొటో సోర్స్, iStock
స్టైల్ అదరాలి
మీకు ప్రపోజల్ రావాలంటే? మీ ఫ్రొఫైల్ మాత్రం సాలిడ్‌గా ఉండాల్సిందే.
మిమ్మల్ని విభిన్నంగా చూపే ఫొటోలను డీపీగా.. అదే డిస్ప్లే పిక్చర్‌గా పెట్టుకుంటే మీకు అవకాశాలు పెరుగుతాయి.
హన్నా సాదాసీదాగా ఈ విషయాన్ని చెప్పడం లేదు. డేటింగ్ సైట్ ఓకే కూపిడ్లో 5000 ప్రొఫైల్స్‌ని అధ్యయనం చేసి మరీ వివరించారు.
మిమ్మల్ని కాస్త వైవిధ్యంగా చూపే పచ్చబొట్లు, ఆహార్యం, హెయిర్ స్టైల్, గడ్డం.. ఇలాంటివి కనిపించేలా మీ డీపీ ఉంటే మరీ మంచిది.
ఫొటో సోర్స్, iStock
చొరవ చూపాలి
ఓ పబ్బో.. లేకుంటే క్లబ్బుకో వెళ్లినపుడు ఓ మూలన కూర్చొంటే.. అవతలి వ్యక్తి వచ్చి ప్రపోజ్ చేస్తారని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే.
అలా చేస్తే ఎవరూ మీ దగ్గరకు రారు. మీరే ముందుకు వెళ్లి కోరుకున్నవారి ప్రేమను పొందాలి. వారి ఆసక్తులకు తగినట్టు ప్రపోజ్ చేయాలి.
ఒకవేళ తిరస్కరించారనుకో.. హుందాగా వెనక్కి తగ్గాలి. లేకుంటే సమస్యలు తప్పవు. పదేపదే వెంటపడటమూ సరికాదు.
అంతేకాని చొరవ చూపి ముందుకు వెళ్లకుంటే ఈ రోజుల్లో ఎవరూ మీ సొంతం కారు. చొరవ మీ నుంచే మొదలుకావాలి.
ఫొటో సోర్స్, iStock
తీరు మారాలి
దంపతుల మధ్య ప్రేమ కలకాలం ఉండాలంటే.. వారి వాగ్వాదంలో (ఆర్గ్యుమెంట్‌లో) హుందాతనం ఉండాలి.
ఇటీవల సైకాలజిస్ట్ జాన్ గాట్మాన్ వందలాది మంది దంపతుల మధ్య వాగ్వాదాలను రికార్డు చేసి వాటిపై పరిశోధన చేశారు.
ఈ వాగ్వాదాల ఆధారంగా సదరు దంపతుల రక్తపోటు, గుండెవేగం మొదలైనవి అధ్యయనం చేసి వీరి మధ్య బంధం ఎప్పుడు ఇబ్బందుల్లో పడుతుందో 90శాతం మేర కచ్చితంగా చెప్పగలిగారు.
బంధం బలంగా ఉన్న దంపతులు వాదులాడేటపుడు ఒకరిపట్ల మరొకరు సానుకూలంగా ఉంటారు.
చర్చలూ సుదీర్ఘంగా సాగుతాయి. వారు వినియోగించే భాష హుందాగా ఉంటుంది.
బంధం పలుచగా ఉన్న దంపతుల్లో అంతా వ్యతిరేకంగా.. ప్రతికూలంగా ఉంటుందని గాట్మాన్ బృందం గుర్తించింది.
మా ఇతర కథనాలు:
- హైదరాబాదీ అమ్మాయిలను హాలిడీ భార్యలుగా వాడుకుంటున్న అరబ్ షేక్‌లు
- ప్రేమ - శృంగారం - వైకల్యం
- చైనాలో ఈ ఐదేళ్లలో వచ్చిన మార్పులివే!
- ఆ ప్రశ్నలు అమ్మాయిలకే ఎందుకు? అబ్బాయిల్ని అడగరెందుకు?
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
- నా కోరికకు, నా వైకల్యానికీ ఏ సంబంధమూ లేదు
- ముద్దు పెట్టుకుంటే మూణ్ణెల్లు జైలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)