ఆయుష్షు పెరగాలంటే.. పెళ్లి చేసుకోండి

వరుడి తలపై జీలకర్ర, బెల్లం పెడుతున్న వధువు

ఫొటో సోర్స్, Getty Images

పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందంట. గుండెకు సంబంధించిన రోగాలు రావంట. ఒంటరిగా ఉంటున్న వాళ్లతో పోల్చితే వివాహితులు ఎక్కువ కాలం జీవించే అవ‌కాశం ఉంద‌ని.. ఆరోగ్యక‌రంగా జీవించేందుకు పెళ్లి ఓ చక్కని మార్గమని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ విష‌యంపై బ్రిట‌న్‌లో 10 లక్షల మందిపై అధ్యయనం జరిగింది. వారంతా అధిక రక్తపోటు.. డ‌యాబెటిస్ వంటి రుగ్మతలతో బాధపడుతున్నవారే.

వీళ్లలో ఒంట‌రిగా ఉంటున్న వారికంటే పెళ్లైన వారు ఎక్కువ సంతోషంగా గడుపుతున్నట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వారిలోనూ.. వివాహితులు తొందరగా కోలుకుంటున్నారని తేలింది.

ముఖ్యంగా గుండెపోటుకు దారితీసే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణకు వివాహం మంచి మందులా ప‌నిచేస్తుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

50 నుంచి 70 ఏళ్ల వ‌య‌సున్న వారిని ప‌రిశీలిస్తే.. అవివాహితుల‌ కంటే వివాహితులు 16శాతం ఎక్కువ కాలం బతుకుతున్నార‌ని ఈ అధ్యయనంలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పెళ్లైనా, కాకపోయినా గుండె సంబంధిత రోగాలకు కారణాలు మీకుంటే సన్నిహితుల సహకారం తీసుకోవటం మంచిది.

వివాహంతో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్‌షిప్‌, సామాజిక బంధుత్వాలు కూడా ఆరోగ్యంగా జీవించేందుకు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డ్డారు.

అయితే.. పెళ్లై విడిపోయిన, భాగ‌స్వామిని కోల్పోయి ఒంట‌రిగా ఉంటున్న వారి విష‌యంలో మాత్రం ప‌రిశోధ‌కులు ఓ స్పష్టతకు రాలేదు.

గుండె జబ్బులకు కారణాలు

  • ధూమపానం, అధిక రక్తపోటు, రక్తంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు, మధుమేహం, అధిక బరువు, శారీకర శ్రమ లేకపోవటం, గుండె జబ్బుల వారసత్వం, పెరుగుతున్న వయస్సు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)