చనిపోయాక కూడా స్నేహితులతో చాటింగ్ చేయొచ్చు

ఫొటో సోర్స్, Science Photo Library
ఎవరికైనా మరణం తప్పదు. ఇది ఎవరూ కాదనలేని సత్యం.
మరి.. ఒక వ్యక్తి మరణానంతరం కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్నేహితులతో చాటింగ్ చేస్తూ.. ఫొటోలతో పోస్టులు పెడుతూ.. పండుగలకు.. బర్తడేలకు విషెస్ చెప్తే ఎలా ఉంటుంది? అంతా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదా.
అది సాధ్యమేనని చెబుతున్నాయి కొన్ని స్టార్టప్ సంస్థలు. అందుకోసం మనిషికి డిజిటల్ రూపాన్ని సృష్టించే పనిలో ఉన్నాయి.
కృత్రిమ మేధస్సు మహిమ..
ప్రపంచవ్యాప్తంగా సంచలనాలకు కారణమవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(కృత్రిమ మేధస్సు) సాయంతో మనిషికి డిజిటల్ రూపాన్ని సృష్టించవచ్చని కొన్ని స్టార్టప్‌లు చెబుతున్నాయి.
అదెలాగంటే..
ఒక వ్యక్తి జీవిత అనుభవాలను.. అభిప్రాయాలు.. ఆలోచనా తీరును.. సంబంధాలు.. సోషల్ మీడియాలో పోస్టులు.. స్నేహితుల బర్త్ డేలు.. ఇలా అన్ని విషయాలనూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అప్లికేషన్ తనలో నిక్షిప్తం చేసుకుంటుంది.
ఫొటో సోర్స్, Getty Images
చనిపోయిన ప్రాణ స్నేహితుడ్ని ఫొటో ఆల్బంలో చూసుకోవడమే కాకుండా.. అతనితో చాటింగ్ చేయగలిగితే ఎలా ఉంటుంది?
వేర్వేరు సందర్భాల్లో సోషల్ మీడియాలో ఆ వ్యక్తి పెట్టిన పోస్టులు.. కామెంట్లు.. లైకులు.. వంటి విషయాల ఆధారంగా అతని అభిప్రాయాలను అంచనా వేస్తుంది.
ఆ సమాచారాన్ని విశ్లేషిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అప్లికేషన్ తనంతట తానే సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తుంది.
ఉదాహరణకు.. స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన రోజుల్ని గుర్తు చేస్తూ ఫొటోలతో ఫేస్బుక్లో ఓ పోస్టు పెడుతుంది. స్నేహితుల పుట్టిన రోజున శుభాకాంక్షలు చెబుతుంది.
సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ జరిపే చర్చల్లో పాల్గొంటుంది.
ఇలా బతికున్న వ్యక్తి లాగే అతని తరఫున సోషల్ మీడియాలో వివిధ రకాల పనులు చేస్తూ ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది ఈ ''డిజిటల్ అవతార్''.
ఫొటో సోర్స్, MARIUS URSACHE
మనుషులకు డిజిటల్ రూపాన్ని సృష్టించడం ఒక వ్యాపారంగా మారుతుందంటున్న ఇటర్‌నైమ్ సంస్థ వ్యవస్థాపకుడు మారియస్ ఉర్షాషే
బిజినెస్ లాజిక్..
మనిషికి డిజిటల్ రూపాన్ని సృష్టించడాన్ని కొన్ని సంస్థలు కొత్తరకం వ్యాపార వనరుగా మార్చుకుంటున్నాయి. ఇందుకోసం అమెరికా.. బ్రిటన్ తదితర దేశాల్లో ఇప్పటికే కొన్ని స్టార్టప్ సంస్థలు వెలిశాయి.
వచ్చే ఏడాది ఈ సేవలు ప్రారంభించేందుకు 'ఇటర్‌నైమ్' అనే సంస్థ సిద్ధమవుతోంది.
ఇప్పటికే 37,000 మందికి పైగా తమ డిజిటల్ అవతార్ సేవల కోసం ఆర్డర్లు ఇచ్చారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు మారియస్ ఉర్షాషే వెల్లడించారు.
మా ఇతర కథనాలు:
- ఛాతి నొప్పా? గుండెపోటా?: నిమిషాల్లో నిర్ధరణ
- ఊపిరి తీస్తున్న పురుగు మందులు!
- 'టైటానిక్'లో హీరో మరణంపై ఆగని చర్చ
- వాయు కాలుష్యంతో భారత్‌లో 25 లక్షల మంది మృతి
- సోషల్ మీడియా... నిద్ర రాదయా!
- మత్తు మందుల్ని మించిన వ్యసనం
- సోషల్ మీడియాలో మీ పిల్లల ఫొటోలు షేర్ చేస్తున్నారా?
- 100 మంది మహిళలు: నారీలోకానికి నాడీమంత్రం
- ప్రశాంత నిద్ర కోరుకునే మీకోసమే ఈ 10 విషయాలు
- 2050 నాటికి అతి పెద్ద పది సవాళ్లివే!
- ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా ఫేస్బుక్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)