క్యాన్సర్‌కు మందు: జికా వైరస్

  • 7 అక్టోబర్ 2017
మనిషి తల బొమ్మ గ్రాఫిక్స్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇప్పటి దాకా జికా వైరస్‌ ప్రపంచానికి ముప్పుగానే అంతా భావించారు. కానీ.. అదే ఓ ఔషధంగా పనిచేస్తుందన్న విషయం మాత్రం తెలియదు

అత్యంత ప్రమాదకరమైన జికా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. కానీ..ఆ వైరస్‌తోనే ప్రాణాంతక బ్రెయిన్ క్యాన్సర్‌ను సులువుగా నయం చేయొచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు.

క్యాన్సర్ బారిన పడ్డ మెదడులోని కణాలను గుర్తించి తొలగించడమంటే వైద్యులకు చాలా కష్టమైన పని.

జికా వైరస్ మాత్రం ఆ కణాలపై మాత్రమే దాడి చేసి వాటిని చంపేస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. బ్రిట‌న్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌ పరిశోధకులు ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇంజక్ష‌న్‌తో క్యాన్స‌ర్ సోకిన ఎలుక మెద‌డులోకి జికా వైర‌స్‌ను పంపించగా.. బాగా ముదిరిన క్యాన్స‌ర్ క‌ణుతుల‌ను చంపేసింది. ఆరోగ్యంగా ఉన్న మెద‌డు క‌ణాలు మాత్రం భ‌ద్రంగా ఉన్నాయి.

జీవాణువుల చిత్రకారులకు నోబెల్

మీరు సోషల్ మీడియాకు బానిసయ్యారా?

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నుషుల‌పై ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేదు. కానీ, మ‌న‌షుల‌పై కూడా జికా వైర‌స్ అలాగే ప‌నిచేస్తుంద‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు.

బ్రెయిన్ కాన్స‌ర్ బాధితుల‌కు స‌ర్జ‌రీకి బ‌దులుగా జికా వైరస్ ఇంజ‌క్ష‌న్లు ఇస్తే స‌రిపోతుంద‌ని జ‌ర్న‌ల్ ఆఫ్ ఎక్స్‌ప‌ర్‌మెంట‌ల్ మెడిసిన్‌లో వెల్ల‌డించారు.

వ‌చ్చే ఏడాది మ‌నుషులపై ప‌రీక్ష‌లు ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు.

Image copyright iStock
చిత్రం శీర్షిక ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నుషుల‌పై ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేదు. కానీ, మ‌న‌షుల‌పై కూడా జికా వైర‌స్ అలాగే ప‌నిచేస్తుంద‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు

చిన్న పిల్ల‌ల‌కు ప్ర‌మాదమే

బ్రెయిన్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న పెద్దల‌కు మాత్ర‌మే జికా వైర‌స్ మేలు చేస్తుంది. చిన్న పిల్ల‌ల‌పై ప్ర‌యోగిస్తే మాత్రం చాలా ప్ర‌మాదం.

ఎందుకంటే.. మెద‌డు ఎదుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే మూల క‌ణాల‌పైనే జికా వైర‌స్ దాడి చేస్తుంది.

చిన్నారుల్లో ఆ క‌ణాలు అధికంగా ఉంటాయి. పెద్ద‌ల్లో అవి చాలా త‌క్కువ ఉంటాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)