గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్న శాస్త్రవేత్తలకు నోబెల్

  • 3 అక్టోబర్ 2017
రైనర్ వీస్, కిప్ థోర్న్, బ్యారీ బ్యారిష్‌, నోబెల్ ప్రైజ్, ఫిజిక్స్ Image copyright AFP/CALTECH/EPA
చిత్రం శీర్షిక రైనర్ వీస్, బ్యారీ బ్యారిష్‌, కిప్ థోర్న్

భౌతికశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని ఈ ఏడాది అమెరికా శాస్త్రవేత్తలు రైనర్ వీస్, కిప్ థోర్న్, బ్యారీ బ్యారిష్‌లు గెలుచుకున్నారు. గురుత్వాకర్షణ తరంగాలను కనిపెట్టినందుకు గాను ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వందేళ్ల కిందట గురుత్వాకర్షణ తరంగాల ఉనికి గురించి మొదటిగా చెప్పారు.

గురుత్వాకర్షణ తరంగాలు అంటే ఏమిటి?

అంతరిక్షంలో భారీ వస్తువులు ప్రయాణిస్తున్నపుడు స్థల-కాలాలలో జరిగే సంకోచ వ్యాకోచాలే గురుత్వాకర్షణ తరంగాలు.

కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్) కలిసిపోవడం లాంటి అతి పెద్ద సంఘటనల వల్ల గురుత్వాకర్షణ తరంగాలు పుడతాయి. వాటిని సాంకేతిక పరిజ్ఞానం గుర్తించలేదని ఐన్‌స్టీన్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

అవునా.. ఐన్‌స్టీన్‌ది మొద్దు నిద్రా?

జీవ గడియారం గుట్టు విప్పినందుకు నోబెల్

ఈ తరంగాలను గుర్తించాలని దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. రెండు కృష్ణ బిలాలు కలిసిపోయినప్పుడు స్థలం 'వంపు' తిరుగుతుందని మొదట 2015లో అమెరికా లిగో లేబరేటరీ గుర్తించింది.

గురుత్వాకర్షణ తరంగాలను కనిపెట్టిన ఈ లిగో-విర్గో అబ్జర్వేటరీలో రైనర్, థోర్న్, బ్యారిష్‌లు సభ్యులు. నోబెల్ బహుమతి కింద లభించే నగదు బహుమతిలో ప్రొఫెసర్ రైనర్‌కు సగం లభిస్తుంది. మిగతా సగం నగదు బహుమతిని థోర్న్, బ్యారిష్‌లకు పంచుతారు.

Image copyright IGO/CALTECH/MIT/SONOMA STATE
చిత్రం శీర్షిక రెండు కృష్ణ బిలాలు విలీనమయ్యే తరహా సంఘటనల వల్ల గురుత్వాకర్షణ తరంగాలు పుడతాయి

స్థల-కాల వస్త్రంలో తరంగాలు...

  • గురుత్వాకర్షణ తరంగాల గురించి సాధారణ సాపేక్ష సిద్ధాంతం జోస్యంగా చెప్పింది
  • ఈ తరంగాలను ప్రత్యక్షంగా గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేయడానికి దశాబ్దాలు పట్టాయి
  • స్థల-కాలాల వస్త్రంలో ఈ తరంగాలను భారీ సంఘటనలు పుట్టిస్తాయి
  • వేగంగా ప్రయాణించే ద్రవ్యరాశులు కాంతి వేగంతో వ్యాపించే ఈ తరంగాలను సృష్టిస్తాయి
  • ఇవి కృష్ణ బిలాలు, న్యూట్రాన్ నక్షత్రాలు ఒకదానిలో మరొకటి విలీనమవుతున్నపుడు ఇవి సంభవించడాన్ని గుర్తించవచ్చు
  • ఈ తరంగాల నుండి వెలువడే అతి సున్నితమైన సంకేతాలను గుర్తించేందుకు అమెరికా లిగో, యూరోపియన్ విర్గో లేబరేటరీలు ఏర్పాటయ్యాయి
  • ఈ లిగో, విర్గోలు ఎల్-ఆకారంలోని పొడవైన సొరంగాలలోకి లేజర్ కిరణాలను పంపించినపుడు ఆ కిరణాలను ఈ తరంగాలు చెదరగొట్టాయి
  • ఈ తరంగాలను గుర్తించడం ద్వారా అంతరిక్షంలో పూర్తిగా వినూత్న పరిశోధనలకు తలుపులు తెరుచుకుంటాయి
Image copyright S.OSSOKINE/A.BUONANNO (MPI GRAVITATIONAL PHYSICS)
చిత్రం శీర్షిక విలీనమవుతున్న రెండు కృష్ణ బిలాల నుండి వెలువడుతున్న గురుత్వాకర్షణ తరంగాల కంప్యూటర్ సిమ్యులేషన్

అతి సూక్ష్మమైన గురుత్వాకర్షణ తరంగాల సంకేతాలను గుర్తించేందుకు అవసరమైన లేజర్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు రైనర్, థోర్న్, బ్యారిష్‌లు అభివృద్ధి చేశారు.

’’గురుత్వాకర్షణ తరంగాలను మనం మొదటిసారి కనిపెట్టేలా ఈ ముగ్గురు పరిశోధకులూ నడిపించారు. గురుత్వాకర్షణ తరంగ అంతరిక్ష పరిశోధన అనే సరికొత్త అద్భుత రంగంలోకి మనం ప్రవేశించడానికి వీరు పునాది వేశారు’’ అని అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ పరిశోధకురాలు కేథరీన్ ఓ-రియోర్డాన్ పేర్కొన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్ నుంచి లద్దాఖ్ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకున్నారు? - లేహ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్

కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా

ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?

కేరళ వరదలు: 'మా వాళ్ళు ఏడుగురు చనిపోయారు.. నేను ఎక్కడికి పోవాలి...'

నడి సంద్రంలో తిండీ నీరూ లేక 14 మంది చనిపోయారు... ఒకే ఒక్కడు బతికాడు

అనంతపురం వైరల్ వీడియో: గ్రామ పెద్ద బాలికను కొట్టిన ఘటనలో ఏం జరిగింది

"డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు

శాండ్‌విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడని హత్య చేసేశాడు