ఎన్టీపీసీ ప్లాంట్‌లో పేలుడు : 10 మంది మృతి

అనుభవ్ స్వరూప్

ఫొటో సోర్స్, Anubhav Swaroop

ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఉంచాహార్ ఎన్టీపీసీ ప్లాంటులో పేలుడు జరిగింది. 10 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు.

ఇక్కడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనూప్ కుమార్ ఈ పేలుడును నిర్ధారించారు.

ఈ సందర్భంగా ఆయన బీబీసీ ప్రతినిధి దిన్షా పాషాతో మాట్లాడుతూ.. ‘‘ఈ పేలుడు వల్ల 10 మంది చనిపోయారు..’’ అని తెలిపారు.

50 మందికిపైగా గాయపడ్డారని వివరించారు.

గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే బాయిలర్ వద్ద ఈ పేలుడు జరిగింది.

మారిషస్ పర్యటనలో ఉన్న ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ గాయపడిన వారికి తగిన చికిత్స అందించాలని ట్వీట్ చేశారు.

చనిపోయిన వారి కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)