దిల్లీని కమ్మేసిన ‘పొగ’ మంచు

చలి కాలం రాగానే దిల్లీలో పొగ మంచు పెరిగిపోతుంది. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతో కాలుష్య తీవ్రత మరింత ఎక్కువవుతుంది.

ప్రస్తుతం దిల్లీలో కాలుష్య స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకన్నా 30 రెట్లు అధికంగా ఉంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది.

కాలుష్యం ఎక్కువగా ఉండటంతో ఈ వారం మొత్తం అన్ని పాఠశాలలకూ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మరికొద్ది రోజులు వాతావరణం ఇలానే ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)