నైజీరియా: ఆత్మాహుతి దాడిలో 50మంది మృతి

  • 21 నవంబర్ 2017
బ్రేకింగ్ న్యూస్

నైజీరియా అదమవా రాష్ట్రంలోని ముబి పట్టణంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 50మంది దుర్మరణం చెందారు.

ఉదయం ఒక మసీదులో అందరూ ప్రార్ధనలు చేస్తుండగా ఆత్మాహుతి దాడి జరిగిందని పోలీసులు చెప్పారు. దాడికి పాల్పడిన వ్యక్తి అదే మతానికి చెందిన వాడై ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షి అబూబకర్ అన్నారు.

ఈ దాడి తమ పనేనని ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా ప్రకటించలేదు. అయితే, రద్దీ ప్రాంతాలు లక్ష్యంగా నైజీరియా బోకో హరాం మిలిటెంట్లు దాడులు చేస్తుంటారు.

బోకో హరాం దాడుల వల్ల గత ఎనిమిదేళ్లలో సుమారు 20వేల మంది చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు.

గతంలో తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి కైవసం చేసుకునేందుకు బోకో హరాం మిలిటెంట్లు ఈ మధ్య ఆత్మాహుతి దాడులకు కూడా పాల్పడుతున్నారని

బీబీసీ ప్రతినిధి ఇషాక్ ఖలీద్ చెప్పారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం