జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే రాజీనామా

  • 21 నవంబర్ 2017
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionముగాబే రాజీనామా ప్రకటించడంతో ఎంపీల సంబరాలు

జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే రాజీనామా చేశారని పార్లమెంట్ స్పీకర్ జాకబ్ ముడెందా ప్రకటించారు. అధికార మార్పిడి సాఫీగా సాగడానికి స్వచ్ఛందంగా తానీ నిర్ణయం తీసుకున్నట్లు ముగాబే లేఖ రాసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

ముగాబేను అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు జింబాబ్వే పార్లమెంట్ ఉభయ సభలు అత్యవసరంగా సమావేశం అయ్యాయి. ముగాబే అభిశంసన తీర్మానంపై చర్చించాయి.

పార్లమెంట్‌లో ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ముగాబే రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ముగాబే ప్రకటించినట్లు స్పీకర్ చెప్పారు. దాంతో అభిశంసన ప్రక్రియ నిలిచిపోయింది.

Image copyright AFP
చిత్రం శీర్షిక జింబాబ్వేను నాలుగు దశాబ్దాల పాటు పాలించిన ముగాబే

అంతకుముందు, పదవి నుంచి తప్పుకునేందుకు ముగాబే ససేమిరా అన్నారు. త్వరలో జరిగే పార్టీ సమావేశాలకు తానే అధ్యక్షత వహిస్తానని టీవీలో ప్రకటించారు. కానీ పార్టీ మాత్రం అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ఆయనపై గట్టిగా ఒత్తిడి తెచ్చింది. ముగాబే బెట్టుచేయడంతో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే ముగాబే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

1980 నుంచి ముగాబే అధ్యక్షుడిగా ఉన్నారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక ముగాబే తప్పుకోవడంతో ప్రజల సంబరాలు

జింబాబ్వేలో అనూహ్య పరిణామాలు

  • రెండు వారాల క్రితం జింబాబ్వే ఉపాధ్యక్షుడు ఎమర్సన్ నాన్‌గాగ్వాను ముగాబే పదవి నుంచి తప్పించడంతో సంక్షోభం మొదలైంది.
  • ముగాబే చర్యలను ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ చివెంగా వ్యతిరేకించారు. పార్టీ ప్రక్షాళన ఆపాలని డిమాండ్ చేశారు.
  • బుధవారం ప్రభుత్వ అధికారిక టెలివిజన్ చానల్‌ ప్రధాన కార్యాలయాన్ని సైనికులు సీజ్ చేశారు.
  • తర్వాత ముగాబేను గృహ నిర్బందం చేశారు.
  • శనివారం ముగాబేకు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరిగాయి.
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionజింబాబ్వే రాజధానిలో ప్రజల హడావుడి
  • ఆదివారం పార్టీ నేతగా ముగాబేను తప్పిస్తూ జమ పీఎఫ్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
  • జింబాబ్వే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెచ్చింది. కానీ ముగాబే అంగీకరించలేదు.
  • మంగళవారం ముగాబేపై పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.
  • దాంతో అధ్యక్ష పదవికి ముగాబే రాజీనామా చేసినట్లు స్పీకర్ ప్రకటించారు.
Image copyright Reuters

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు