‘జయ ఆస్పత్రిలో ఉన్నపుడు శశికళ తీసిన వీడియో’

‘జయ ఆస్పత్రిలో ఉన్నపుడు శశికళ తీసిన వీడియో’

తమిళనాడు మాజీ సీఎం జయ ఆస్పత్రిలో ఉన్నపుడు తీసిన వీడియో అంటూ.. దినకరన్ వర్గం ఎమ్మెల్యే వెట్రివేల్ దీన్నివిడుదల చేశారు. దీన్ని మొదట పబ్లిష్ చేసిన బీబీసీ తెలుగు.. తర్వాత ఈసీ ఆదేశాల మేరకు తొలగించింది.

జయను అత్యవసర వార్డు నుంచి సాధారణ వార్డుకు మార్చినపుడు తీసిన వీడియో ఇదని వివరించారు.

దీన్ని శశికళ చిత్రీకరించారని తెలిపారు. ఆమెకు సరిగా చికిత్స అందించలేదన్నఆరోపణలు అవాస్తవమని ఆయన వివరించారు.

ఆమె నుంచి తాను ఈ వీడియోను తీసుకున్నానని చెప్పారు.

తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత ఏడాది కిందట తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు.

ఆర్కే నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ వీడియోని తొలగించాలని ఈసీ ఆదేశించింది.

ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)