జయ వీడియో తొలగించాలని ఈసీ ఆదేశం

జయ వీడియో తొలగించాలని ఈసీ ఆదేశం

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్పత్రిలో ఉన్నపుడు తీసిన వీడియో అంటూ.. దినకరన్ వర్గానికి చెందిన వెట్రివేల్ ఓ వీడియోను విడుదల చేశారు.

ఇది బుధవారం ఉదయం దేశ వ్యాప్తంగా వైరల్ అయింది.

అయితే చెన్నైలోని ఆర్‌కే నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ వీడియోను విడుదల చేయడం సరికాదని ఈ ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

వైరల్ అయిన జయ వీడియోను వెంటనే తొలగించాలని ఆదేశించారు. దీంతో బీబీసీ తెలుగు ఆ వీడియోను తమ వెబ్‌సైట్, సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించింది.

జయను అత్యవసర వార్డు నుంచి సాధారణ వార్డుకు మార్చినపుడు శశికళ తీసిన వీడియో ఇదని పేర్కొంటూ వెట్రివేల్ ఓ వీడియోను విడుదల చేశారు.

జయకు సరిగా చికిత్స అందించలేదన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన వివరించారు.

శశికళ నుంచి తాను ఈ వీడియోను తీసుకున్నానని చెప్పారు.

తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత ఏడాది కిందట తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు.

ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)