ఒక ఇంట్లో పెళ్లి.. మరో ఇంట్లో విషాదం

  • 12 ఫిబ్రవరి 2018
వివాహ వేడుక జరిగిన ప్రాంతం Image copyright Satpal Rattan/BBC
చిత్రం శీర్షిక వివాహ వేడుక జరిగిన ప్రాంతం

ఒక ఇంట్లో పెళ్లి వేడుక మరో ఇంట్లో విషాదాన్ని మిగిల్చింది. పంజాబ్‌లో అశోక్ ఖోస్లా అనే వ్యక్తి తన కూతురి వివాహ వేడుకుల్లో భాగంగా సంతోషంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తూటా తగిలి పొరుగింట్లో ఉండే 22ఏళ్ల యువతి చనిపోయింది.

పంజాబ్‌లోని హోషియార్పూర్ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అశోక్ ఖోస్లా కాల్పులు జరిపే సమయానికి సాక్షి అరోరా తన ఇంటి మేడ మీద నిలబడి ఉంది.

Image copyright Courtesy Hindustan Times
చిత్రం శీర్షిక సాక్షి అరోరా

అశోక్ తుపాకీలోంచి వెళ్లిన తూటా నేరుగా సాక్షి నుదుటి భాగంలోకి చొచ్చుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అశోక్ ఖోస్లాను అరెస్టు చేసినట్లు పోలీసులు బీబీసీకి తెలిపారు.

వేడుకలో తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన అశోక్ సేథీ అనే మరో వ్యక్తిపైనా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Image copyright Satpal Rattan/BBC
చిత్రం శీర్షిక కాల్పులు జరిగింది ఈ ఇంటి ముందే

‘వాళ్లేం ప్రొఫెషనల్ షూటర్లు కాదు, తూటా ఎవరికైనా తగిలే ప్రమాదం ఉందని వాళ్లకు తెలిసుండాలి’ అని పోలీసు అధికారి ఒకరు అన్నారు.

పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలా వేడుకల్లో భాగంగా తూటా దెబ్బలకు మనుషులు గాయపడ్డ, చనిపోయిన సంఘటనలు ఇటీవలి కాలంలో అనేకం జరిగాయి.

2016నవంబర్‌లో పెళ్లి వేడుకల్లో భాగంగా ఓ మహిళ నృత్యం చేస్తూ గాల్లోకి కాల్పులు జరపగా ఒక వ్యక్తి చనిపోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Image copyright Manoj Dhaka
చిత్రం శీర్షిక సాధ్వీ దేవా ఠాకూర్ (ఎడమ) కూడా ఓ వివాహ వేడుకల్లో కాల్పులు జరిపి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యారనే ఆరోపణలున్నాయి..

2016 డిసెంబర్‌లో పెళ్లి వేడుకల్లో ఓ డ్యాన్సర్ కూడా ఇలాంటి ఘటనలో చనిపోయినట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఉత్తరాదిలో ఏటా ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.

తమ హోదా, దర్పం ప్రదర్శించడానికి వేడుకల్లో ఇలా కాల్పులు జరపడం భారత్‌కే పరిమితం కాదు. ఆఫ్గనిస్థాన్, మిడిల్ ఈస్ట్‌లోని కొన్ని దేశాల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు