ప్రపంచానికి అతిపెద్ద ముప్పు ఇరాన్: నెతన్యాహు

  • 18 ఫిబ్రవరి 2018
చేతిలో డ్రోన్ భాగంతో నెతన్యాహు Image copyright Reuters
చిత్రం శీర్షిక చేతిలో డ్రోన్ శకలంతో నెతన్యాహు

ప్రపంచానికి అతిపెద్ద ముప్పు ఇరాన్ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు.

మ్యునిచ్‌లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ దేశం చుట్టూ భీతావహ వాతావరణాన్ని సృష్టించాలనే ఇరాన్ ప్రయత్నాలను తాము అనుమతించమని ఆయన అన్నారు.

‘మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడం’ అని ఆయన చెప్పారు.

ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మొహమ్మద్ జావెద్ జరిఫ్ తన వాక్పటిమతో చాలా చాకచక్యంగా అబద్ధాలు చెబుతారని ఆయన విమర్శించారు.

గత వారం ఇరాన్ తమ దేశంలోకి డ్రోన్‌ను పంపిందనీ, కానీ ఆ విషయాన్ని వారు ఒప్పుకోవట్లేదనీ, ఆ డ్రోన్‌ను తమ బలగాలు కూల్చేశాయనీ నెతన్యాహు తెలిపారు.

పేలిపోయిన డ్రోన్‌కు చెందిన ఓ శకలాన్ని చేతిలో పట్టుకొని ఆ వ్యవహారం గురించి నెతన్యాహు నేరుగా సమావేశంలో ఉన్న ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి జరిఫ్‌ను ప్రశ్నించారు. ‘మీకు ఈ డ్రోన్ విషయం తెలుసా? మీకు తెలియాలి, ఎందుకంటే ఈ డ్రోన్ మీదే’ అన్నారు.

ఈ సమావేశంలో జరిఫ్ ఇంకా మాట్లాడాల్సి ఉంది. మరో పక్క నెతన్యాహు స్వదేశంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు