జర్నలిస్టు జే డే హత్యకేసులో ఛోటా రాజన్ సహా 9 మందికి జీవిత ఖైదు

  • 2 మే 2018
జే డే హత్యకేసు Image copyright Getty Images

తొమ్మిదేళ్ల క్రితం సీనియర్ పాత్రికేయుడు జ్యోతిర్మయ్ డే (జే డే)ను హత్య చేసిన కేసులో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ సహా 9 మంది దోషులకు మోకా కోర్టు జీవిత ఖైదు విధించింది.

56 ఏళ్ల డే మిడ్‌డే అనే సాయంకాల పత్రికకు క్రైమ్ రిపోర్టర్‌గా పని చేస్తుండేవారు. జే డే అనే కలం పేరుతో ప్రముఖ పాత్రికేయుడిగా పేరొందారు.

ముంబయి శివారు పోవై ప్రాంతంలో 2011 జూన్ 11వ తేదీన జే డే మోటారు సైకిల్‌పై తన ఇంటికి వెళుతుండగా కాల్చి చంపారు.

పట్టపగలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ హత్య జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

తొమ్మిదేళ్ల విచారణ అనంతరం, ముంబయిలోని ప్రత్యేక మోకా కోర్టు ఈ కేసులో ప్రధాన ముద్దాయి ఛోటా రాజన్ సహా మొత్తం 8 మంది దోషులని ప్రకటిస్తూ బుధవారం ఉదయం తీర్పు వెలువరించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు