తెలంగాణ ఎన్నికలు 2018: ఎన్టీఆర్ తరువాత నందమూరి సుహాసినే

  • 28 నవంబర్ 2018
ఎన్టీఆర్, నందమూరి సుహాసిని Image copyright facebook
చిత్రం శీర్షిక తాత ఎన్టీఆర్, మనవరాలు నందమూరి సుహాసిని

తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి సుహాసిని రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టినీ ఆకర్షించడమే కాకుండా రాజకీయంగానూ ఎన్టీఆర్ తరువాత ఆ కుటుంబం నుంచి తెలంగాణలో పోటీ చేస్తున్న అభ్యర్థిగా ప్రత్యేకత సాధించారు.

సినీ హీరోగా, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రఖ్యాతి సాధించిన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) రెండుసార్లు తెలంగాణ నుంచి పోటీ చేశారు. ఆయన కుటుంబం నుంచి పలువురు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ తెలంగాణ ప్రాంతం నుంచి ఆయనొక్కరే బరిలో దిగారు.

సుదీర్ఘ విరామం తరువాత ఆయన మనవరాలు నందమూరి సుహాసిని ఈ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల క్షేత్రంలో దిగారు.

దీంతో ఎన్టీఆర్ తరువాత సుమారు 30 ఏళ్లకు మళ్లీ ఆ కుటుంబం నుంచి ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్న అభ్యర్థిగా ఆమె గుర్తింపు పొందారు.

Image copyright facebook/NandamuriSuhasini
చిత్రం శీర్షిక నందమూరి సుహాసిని ప్రచారం

ఎన్టీఆర్ ఓటమి తరువాత..

ఎన్టీఆర్ తొలిసారి 1985లో తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన కోస్తాలోని గుడివాడ, రాయలసీమలోని హిందూపురంతో పాటు తెలంగాణ ప్రాంతంలోని నల్లగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

మూడు స్థానాల్లోనూ విజయం సాధించిన ఆయన నల్లగొండలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.రామచంద్రారెడ్డిపై 30 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

మూడు చోట్ల నుంచి గెలిచినప్పటికీ నల్లగొండ, గుడివాడ స్థానాలను వదులకుని హిందూపురానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు.

అనంతరం 1989లో ఆయన మరోసారి తెలంగాణ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తరంజన్ దాస్ చేతిలో ఓటమి పాలయ్యారు.

ఆ తరువాత ఎన్టీఆర్ కానీ, ఆయన కుటుంబీకులు కానీ ఈ ప్రాంతం నుంచి మళ్లీ పోటీ చేయలేదు. 29 ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ అదే కుటుంబానికి చెందిన నందమూరి సుహాసిని తెలంగాణ ఎన్నికల్లో బరిలో దిగారు.

Image copyright facebook/DaggubatiPurandeswari
చిత్రం శీర్షిక ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి విశాఖ, బాపట్ల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు

జయకృష్ణ, హరికృష్ణ, బాలకృష్ణ, పురంధేశ్వరి.. అంతా సీమాంధ్ర నుంచే..

ఎన్టీఆర్ కుమారులు జయకృష్ణ, హరికృష్ణ, బాలకృష్ణ, కుమార్తె పురంధేశ్వరి కూడా గతంలో ప్రజాక్షేత్రంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ వారంతా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనే పోటీ చేశారు.

నందమూరి జయకృష్ణ శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి 1996లో పోటీ చేశారు. లక్ష్మీపార్వతి స్థాపించిన ఎన్టీఆర్ టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.

మరో కుమారుడు నందమూరి హరికృష్ణ 1996 ఉప ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసి భారీ ఆధిక్యంతో గెలిచారు. ఇంకో కుమారుడు బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు.

కుమార్తె పురంధేశ్వరి తొలిసారి విశాఖపట్నం నుంచి, రెండోసారి బాపట్ల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు.

ప్రస్తుతం నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం తరఫున కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఎల్‌ఎల్‌బీ చదివిన సుహాసిని వృత్తిరీత్యా తాను సామాజికవేత్తనని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

సుహాసిని మామ చుండ్రు శ్రీహరి కూడా రాజకీయ నేపథ్యం ఉన్నవారే. ఆయన రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి 1984లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

గోదావరిలో వ‌రుస పడవ ప్ర‌మాదాలు... ఎందుకిలా జ‌ర‌ుగుతోంది? ఎవరు బాధ్యులు?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

కశ్మీర్: పీఎస్ఏ చట్టం కింద ఫారూక్ అబ్దుల్లా నిర్బంధం... ఏమిటీ చట్టం? ఎంత కఠినం?

దక్షిణ కొరియా నాయకులు ఎందుకు గుండు కొట్టించుకుంటున్నారు?

ధోనీ మళ్లీ ఆడతాడా... భారత క్రికెట్‌కు అతడి అవసరం ఇంకా ఉందా?

ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'..

గుజరాత్ 2002 అల్లర్ల ముఖ చిత్రాలైన వీళ్లను గుర్తుపట్టారా.. వీళ్లు ఇప్పుడేం చేస్తున్నారు

గోదావరి బోటు ప్రమాదం: 20కి చేరిన మృతులు.. మరో 27 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు