ఈ వార్తను చదవాలంటే స్క్రీన్‌పై టచ్ చేయండి

ప్రపంచంపై తమదైన ముద్ర వేసిన స్ఫూర్తిదాతలు

BBC

ఈ వార్తను చదవాలంటే స్క్రీన్‌పై టచ్ చేయండి

ఎందరున్నా.. ఆ మరకను దాచుకోలేదు

MANJITA VANSZARA

మంజిత గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏసీపీ. నేరస్తులను హడలెత్తించడమే కాదు, చక్కగా కూచిపూడి, భరత నాట్యం కూడా చేస్తారు.

MANJITA VANSZARA

ఈమె ఓ సదస్సులో విధులు నిర్వహిస్తుండగా పీరియడ్స్ వచ్చాయి. వెనుక 40 మంది మగ పోలీసు అధికారులు ఉన్నారు.

MANJITA VANSZARA

ఆమె యూనిఫాంపై మరకను దాచుకోలేదు.“మేడం మరక బయటికి కనిపిస్తోంది” అని గన్‌మెన్ చెప్పారు. దీనికి ఆమె ‘అది సహజంగా వచ్చేదే, వర్రీ అవ్వొద్దు’ అని బదులిచ్చారు.

MANJITA VANSZARA

BBC

ఈ వార్తను చదవాలంటే స్క్రీన్‌పై టచ్ చేయండి

ఈ ప్రయోగాలు చూస్తే మతిపోతుంది

BBC

అతి తక్కువ ఖర్చుతో కొత్త సాధనాలను రూపొందిస్తూ, సామాన్యుల జీవితాల్లో మార్పుతెచ్చేందుకు కృషి చేస్తున్నారు అస్సాంవాసి ఉద్ధభ్ భరలి.

BBC

వ్యవసాయం, వికలాంగులకోసం చేసిన ఆవిష్కరణలతో ఉద్ధబ్‌కు దేశవ్యాప్తంగా పేరొచ్చింది. అవి వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.

BBC

చుట్టూ ఉన్న సమస్యల పరిష్కారానికి ఆలోచించే వారే ఇన్నొవేటర్స్. ఆవిష్కరణ మనలోనే పుడుతుంది. ఎవరో మనల్ని ఇన్నొవేటర్లుగా చేయలేరు. మనకు మనమే తయారవ్వాలి' అంటారు ఉద్ధభ్.

BBC

BBC

ఈ వార్తను చదవాలంటే స్క్రీన్‌పై టచ్ చేయండి

పోయిన గొంతు రూ.60తో వస్తుంది!

BBC

సృష్టిలో మాట్లాడే శక్తి మనిషికి మాత్రమే ఉంది. కానీ కేన్సర్ కారణంగా కొందరు ఆ మాటను కోల్పోవాల్సి వస్తోంది. దీనికి రూ.60తో పరిష్కారం చూపిస్తున్నారు ఓ డాక్టర్.

BBC

పేద రోగుల సమస్యను పరిష్కరించడానికి ఏదైనా చేయాలన్న తపనతో డాక్టర్ విశాల్ రావ్ తన ప్రయోగాల్ని మొదలుపెట్టారు. ఆ కృషి ఫలితమే 'ఓం' వాయిస్ బాక్స్.

BBC

మాట్లాడటం ప్రతి ఒక్కరి హక్కు అనేది నా అభిప్రాయం. అందుకే ఓం బాక్స్ తయారీపై దృష్టి పెట్టా' అంటూ ఆ పరికరం తయారీ వెనక ఉన్న నేపథ్యాన్ని వివరిస్తారు డాక్టర్ విశాల్.

BBC

BBC

ఈ వార్తను చదవాలంటే స్క్రీన్‌పై టచ్ చేయండి

ఇచట వృద్ధులకు పెళ్లిళ్లు చేయబడును

BBC

పెళ్లి అనేది కేవలం ఒక వయసు ముచ్చటే కాదు. తోడు ఎవరికైనా అవసరమే. ఒంటరితనాన్ని భరించలేని వృద్ధులు, జీవిత చరమాంకంలోనూ తోడును కోరుకుంటున్నారు.

BBC

ఇలాంటి ఒంటరితనమే ఓ మహిళను వేధించింది. దీంతో ఆమె వృద్ధుల కోసం ఒక మ్యారేజీ బ్యూరోను ప్రారంభించారు. ఆమె పేరు రాజేశ్వరి. ఆ సంస్థ పేరు “తోడునీడ”.

BBC

“మా ద్వారా వృద్ధులు తమ అభిరుచులకు తగిన వ్యక్తులను కలుసుకోవచ్చు. ఇందుకు ఎటువంటి రుసుమూ తీసుకోం” అని రాజేశ్వరి అన్నారు.

BBC

ఈ వార్తను చదవాలంటే స్క్రీన్‌పై టచ్ చేయండి

మృదంగం మగవాయిద్యం కాదు

BBC

ఆమె మృదంగం వాయిస్తుంటే అక్కడ ఇంకే ధ్వనీ వినిపించదు. మృదంగం వాయిస్తున్నంత సేపు ఆమెకు ఇంకేమీ తెలియదు. ఒక పారవశ్యం ఆమెను కమ్మేస్తుంది.

BBC

68ఏళ్ల సుమతి రామ్మోహనరావు... ఆడపిల్లలు గడప దాటకూడదన్న కాలంలోనే తనకెంతో ఇష్టమైన మృదంగం నేర్చుకున్నారు. ఆమె ‘మృదంగం పట్టుకోగానే నాకు పూనకం వస్తుంది’ అంటారు.

BBC

మృదంగంలో సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. మృదంగం మీద నాట్యం చేస్తున్న సుమతి చేతి వేళ్లను మీరూ ఓసారి పలకరించండి.

BBC