శని గ్రహం వింతలెన్నో రికార్డు చేసిన కస్సిని

కస్సీని, cassini

ఫొటో సోర్స్, Getty Images

నాసా ప్రతిష్ఠాత్మకంగా భావించే కస్సిని ఉపగ్రహ సుదీర్ఘ యాత్ర శుక్రవారంతో ముగిసింది.

దాదాపు 13 ఏళ్ల పాటు శని గ్రహం, దాని ఉప గ్రహాలను చుట్టేసి అక్కడి ఎన్నో రహస్యాలను ప్రపంచానికి చెప్పింది. శని గ్రహానికి ఉపగ్రహాలైన ఎన్సెలడస్‌, టైటాన్‌లపై ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో గుర్తించింది.

ఫొటో సోర్స్, NASA

శని గ్రహంతోపాటు ఉపగ్రహాల ఫొటోలు తీసేందుకు 1997లో కస్సిని ఉపగ్రహాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపింది. 2004లో అది శని గ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి కక్ష్యలో తిరుగుతూ పరిశోధకులకు విలువైన సమాచారాన్ని అందిస్తూ వచ్చింది.

ఫొటో సోర్స్, NASA/JPL-CALTECH/SSI

అక్కడ వాతావరణ పరిస్థితులు, నీటి వనరులు ఎలా ఉన్నాయి? జీవుల మనుగడ సాధ్యమేనా? అనే అంశాలకు సంబంధించి కీలక సమాచారాన్ని నాసాకు చేరవేసింది.

ఫొటో సోర్స్, NASA/JPL-CALTECH/SS

ఫొటో క్యాప్షన్,

కస్సిని తీసిన చివరి చిత్రాల్లో ఇదొకటి. ఇందులో శని ఉత్తర భాగం మీదుగా వెళ్తున్న ఎన్సెలడస్‌.

కస్సిని విశేషాలు

ప్రయాణం: దాదాపు 788కోట్ల 57 లక్షల 85 వేల 600 కిలోమీటర్లు, వేగం: గంటకు 1.12 లక్షల కిలోమీటర్లు, తీసిన ఫొటోలు: 4,50,000, గుర్తించిన ఉపగ్రహాలు: 6, ఆఖరి తేది 15-09-2017

ఫొటో సోర్స్, Reuters

ఇంధనం అయిపోవడంతో కస్సిని కక్ష్య నుంచి శని గ్రహంపైకి పడిపోవడం ప్రారంభించింది. చివరకు శని గ్రహ వాతావరణంలోకి ప్రవేశించగానే విచ్ఛిన్నమైపోయింది.

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.