నాడు భారీకాయురాలిగా పేరుపడ్డ ఈజిప్టు మహిళ అనారోగ్యంతో మృతి

  • 26 సెప్టెంబర్ 2017
Egyptian woman on a stretcher in Mumbai on May 4, 2017. Image copyright Getty Images
చిత్రం శీర్షిక మే 4న ముంబయిలో ఎమన్ అహ్మద్

గతంలో ప్రపంచంలోనే అత్యంత భారీకాయురాలిగా పేరుపడ్డ ఈజిప్టు మహిళ ఒకరు అనారోగ్యంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ రాజధాని అబుధాబిలోని ఒక ఆస్పత్రిలో చనిపోయారు.

ఊబకాయంతో బాధపడుతున్న ఎమన్ అహ్మద్ అబ్ద్ అటీ బరువు తగ్గించుకొనేందుకు ఈ ఏడాది ప్రథమార్ధంలో భారత్‌లోని ముంబయిలో బేరియాట్రిక్ సర్జరీ చేయించుకొన్నారు. ఎమన్ అహ్మద్‌కు 37 ఏళ్లు. 500 కేజీల బరువున్న ఆమె శస్ర్తచికిత్స తర్వాత 300 కేజీలకు పైగా తగ్గారని, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయారని యూఏఈ మీడియా తెలిపింది. ఆమెకు గుండెజబ్బు, మూత్రపిండాలు పనిచేయకపోవడమనే సమస్యలు ఉన్నట్లు యూఏఈలోని ఆస్పత్రి ఒక ప్రకటనలో పేర్కొంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జులై 24న అబుధాబిలోని బుర్జీల్ ఆస్పత్రిలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమన్ అహ్మద్

పాతికేళ్లు ఇంటికే పరిమితం

శస్ర్తచికిత్సకు ముందు ఎమన్ అహ్మద్ పాతికేళ్లపాటు ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స విషయమై ఆమె సోదరి అప్పట్లో ఆన్‌లైన్‌లో క్యాంపెయిన్ జరిపారు. ఆ నేపథ్యంలో ఒక భారతీయ డాక్టర్ ఆధ్వర్యంలో చికిత్స కోసం ఛార్టర్డ్ విమానంలో ఎమన్ అహ్మద్‌ను ముంబయికి తరలించారు. తర్వాత సర్జరీకి సంబంధించి ముంబయి వైద్య బృందంపై ఆమె కుటుంబం బహిరంగ విమర్శలు చేసింది. బరువు తగ్గుదల గురించి వైద్యబృందం చెప్పినదానిపై అనుమానాలు వ్యక్తంచేసింది. ఈ పరిణామాల అనంతరం ఎమన్ అహ్మద్‌ను చికిత్స కొనసాగించేందుకు మే నెలలో ముంబయి నుంచి యూఏఈకి తరలించారు.

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)

ముఖ్యమైన కథనాలు