ఇదే భగత్‌సింగ్ పూర్వీకుల ఇల్లు!

‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే నినాదానికి మారుపేరుగా నిలిచిన భగత్‌సింగ్‌ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన ఇల్లు ఇప్పుడెలా ఉందో తెలుసా?

ఫొటో క్యాప్షన్,

భగత్‌సింగ్ పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్‌కు దగ్గరలో ఉన్న ఖట్కర్ కలాన్ గ్రామంలో నివసించారు. ఆయన 1907 సెప్టెంబర్ 28న ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో బాంగా గ్రామంలో జన్మించారు.

ఫొటో క్యాప్షన్,

ఇది ఆనాడు ఒక పల్లెటూరు. ఇప్పుడు అనేక భవంతులు వెలిశాయి. అయితే భగత్‌సింగ్ పూర్వీకుల ఇల్లు మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది.

ఫొటో క్యాప్షన్,

భగత్‌సింగ్ తల్లి 1975 వరకు ఇక్కడే నివసించారు. ఆమె చనిపోయిన తర్వాత మిగతా కుటుంబ సభ్యులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు.

ఫొటో క్యాప్షన్,

భగత్ సింగ్ పూర్వీకుల ఇంటిని ఇప్పుడు జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించారు. అప్పుడప్పుడు చిన్న చిన్న మరమ్మత్తు పనులు చేస్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

పర్యాటకులకు సమాచారం కోసం ఈ ఇంటి ద్వారం వద్ద పురాతత్వ శాఖ ఒక బోర్డును ఏర్పాటు చేసింది.

ఫొటో క్యాప్షన్,

ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లే మార్గం ఇది. ఈ పసుపు రంగు ఇంట్లోనే భగత్ సింగ్ బాల్యం గడిచింది.

ఫొటో క్యాప్షన్,

భగత్‌సింగ్ తల్లికి చెందిన వస్తువులను సురక్షితంగా ఉంచడం కోసం ఈ ఇంటి లోపలి భాగాన్ని పురాతత్వ శాఖ మూసేసింది.

ఫొటో క్యాప్షన్,

నగిషీలు చెక్కిన ఈ నవ్వారు మంచం, అల్మారీ వందేళ్లు దాటినా ఇంకా చెక్కు చెదరలేదు.

ఫొటో క్యాప్షన్,

బొగ్గుల ఇస్త్రీ పెట్టె వంటి వస్తువులు ఈ అల్మరాలో ఉన్నాయి.

ఫొటో క్యాప్షన్,

ఆనాడు స్నానానికి ఉపయోగించిన బాత్ టబ్, బకెట్ ఇంకా అలాగే ఉన్నాయి.

ఫొటో క్యాప్షన్,

భగత్ సింగ్ తల్లి 1975 దాకా ఈ వస్తువుల్ని ఉపయోగించే వారట.

ఫొటో క్యాప్షన్,

వంటింట్లో కనిపించే పాత్రల్లో ఎక్కువ భాగం రాగి, ఇత్తడివే.

ఫొటో క్యాప్షన్,

ఖట్కర్ కలాన్ గ్రామంలో పంజాబ్ ప్రభుత్వం భగత్ సింగ్ స్మృత్యర్థం ఒక మ్యూజియం ఏర్పాటు చేసింది.

ఫొటో క్యాప్షన్,

ఈ మ్యూజియంలో ఆయనకు సంబంధించిన అనేక ఇతర వస్తువుల్ని ఉంచారు.