యశ్వంత్ సిన్హా 80 ఏళ్ల నిరుద్యోగి: అరుణ్ జైట్లీ

  • 29 సెప్టెంబర్ 2017
అరుణ్ జైట్లీ, యశ్వంత్ సిన్హా Image copyright Getty Images

యశ్వంత్ సిన్హా ఓ 80 ఏళ్ల నిరుద్యోగి అంటూ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీవిమర్శించారు. ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారంటూ తనపై విమర్శలు గుప్పించిన సిన్హా వ్యాఖ్యలపై జైట్లీ స్పందించారు. ఆర్థికమంత్రిగా ఆయన తన వైఫల్యాలను మర్చిపోయారా అని ప్రశ్నించారు.

సిన్హా పేరును ప్రస్తావించకుండానే, 1998- 2002లో (సిన్హా ఆర్థికమంత్రిగా ఉన్న కాలంలో) నిరర్థక ఆస్తులు 15 శాతానికి చేరిన విషయాన్ని జైట్లీ ప్రస్తావించారు. ఇప్పుడు అవతలి పక్షం వైపుకు చేరిపోయి కథను మొత్తం మార్చేస్తున్నారని ఆరోపించారు.

పీటీఐ వార్తాసంస్థ కథనం ప్రకారం, ఒక పుస్తకావిష్కరణ సభలో జైట్లీ సిన్హా వ్యాఖ్యలపై ప్రతిస్పందించారు.

Image copyright AFP

సిన్హా కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంతో కుమ్మక్కయ్యారని జైట్లీ ఆరోపించారు. అంత మాత్రాన వాస్తవాలు మారిపోవని ఆయన అన్నారు.

విధానాలను విమర్శించేటప్పుడు వ్యక్తులపై వ్యాఖ్యలు చేయరాదన్న సంప్రదాయాన్ని సిన్హా విస్మరించారంటూ నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా సిన్హా ఉద్యోగాన్ని ఆశిస్తున్నారన్నారని ఆరోపించారు.

Image copyright Indian Express

‘నిరుద్యోగి@80'

తాను ఆవిష్కరించిన పుస్తకం పేరు 'ఇండియా@70, మోడీ@3.5' కాకుండా, 'ఇండియా@70, మోడీ@3.5' నిరుద్యోగి@80' అని ఉంటే బాగుండేదని జైట్లీ ఎద్దేవా చేశారు.

అరుణ్ జైట్లీ విధానాలను విమర్శిస్తూ 'ఐ నీడ్ టు స్పీక్ అప్ నౌ' పేరిట యశ్వంత్ సిన్హా ఒక వార్తాపత్రికలో వ్యాసం రాశారన్న విషయం తెలిసిందే. ఆ వ్యాసంలో మోదీ ప్రభుత్వ ఆర్ధిక విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఎస్టీ, నో రద్దు అంశాలను తప్పుబడుతూ, ఆర్థికవ్యవస్థను జైట్లీ నాశనం చేశారని సిన్హా ఆరోపించారు.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత వృద్ధి రేటు గత మూడేళ్లలో కనిష్ట స్థాయికి చేరి, 5.7 శాతానికి పడిపోయింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)

సంబంధిత అంశాలు