ఫ్రాన్స్ విమానానికి తృటిలో తప్పిన ముప్పు

  • 1 అక్టోబర్ 2017
ఎయిర్ ఫ్రాన్స్, ఎఎఫ్66 Image copyright STAN HONDA/AFP/Getty Images

పారిస్ నుంచి లాస్ ఏంజెలిస్ వెళుతున్న ఎయిర్ ఫ్రాన్స్ విమానం ఎఎఫ్66 కు పెనుముప్పు తప్పింది. విమానం అట్లాంటిక్‌ మహా సముద్రంపై వెళుతుండగా.. నాలుగు ఇంజిన్‌లలో ఒక ఇంజిన్‌కు చెందిన కొంత భాగం ఊడిపోయింది. ఇలా ఊడిపోయిన భాగం ఇప్పుడు దొరికింది. పామియుట్ పట్టణానికి 150 కి.మీ దూరంలో ఎడారిలో ఈ ఇంజిన్ భాగాన్ని గుర్తించారు.

ఇంజిన్ భాగం ఊడిపోయిన వెంటనే పెద్దగా శబ్దం వచ్చిందని విమానంలో ప్రయాణిస్తున్న డేవిడ్ రెహ్మార్ అనే మాజీ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్ తెలిపారు.

ఇంజిన్ ఫ్యాన్ ఫెయిల్ కావడమే అందుకు కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

ఈ ఘటనతో కొంతసేపు ప్రయాణికుల్లో ఆందోళన నెలకొందని వివరించారు.

ఇవికూడా చూడండి

అయితే సెకన్ల వ్యవధిలోనే పైలెట్లు ఫెయిల్ అయిన ఇంజిన్‌ను ఆఫ్ చేసి, మూడు ఇంజిన్లతోనే ప్రయాణాన్ని కొనసాగించారు.

3ఇంజిన్లతోనే..

గంట పాటు మూడు ఇంజిన్లతోనే ప్రయాణించిన విమానం కెనడాలోని లాబ్రాడార్‌లో అత్యవసరంగా ల్యాండైంది.

Image copyright DAVID REHMAR
చిత్రం శీర్షిక ఊడిన ఇంజిన్ భాగం

ప్రమాదం జరిగినపుడు విమానంలో 496 మంది ప్రయాణికులు, 24 మంది సిబ్బంది ఉన్నారు.

ప్రమాదంపై స్పందిస్తూ ఎయిర్ ఫ్రాన్స్.. ఇంజిన్ ఫెయిల్ సందర్భంగా తమ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారని తెలిపింది.

ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.