ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’

  • 6 నవంబర్ 2017
మహాత్మాగాంధీ ఎంఎస్ ధోనీ
చిత్రం శీర్షిక ‘ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ దాన్ని అంగీకరించాల్సిందేనని దానర్థం కాదు. విభేదిస్తే నిజాయితీగా అభిప్రాయం తెలపాలి’

అభిప్రాయ భేదాలు ఉండడంలో తప్పులేదనీ, వాటిని నిజాయితీగా స్వీకరించగలగాలనీ ధోనీ చెప్పారు. అక్టోబర్ 2, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలూ, సిద్ధాంతాల గురించి క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడారు. గాంధీజీ విధానాలు తన జీవితంపై ఎంతో ప్రభావం చూపాయని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ హిందీ జర్నలిస్టు సునందన్ లెలేకు ధోనీ ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివీ:

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఎంఎస్ ధోనీ: ‘నేను అనుసరించేదీ గాంధీ మార్గమే’

నేను అనుసరించే విధానం..

‘‘అహింస, నిజాయితీ, మనోబలం, ఖచ్చితత్వం, దేన్నైనా సాధించే దాకా వదిలిపెట్టని పట్టుదల.. ఇవన్నీమహాత్మా గాంధీలో ఉన్న ఉత్తమ లక్షణాలు. గాంధీ పేరు వినగానే ఈ మాటలన్నీ నాకు గుర్తొస్తాయి. ఓ మంచి వ్యక్తిత్వాన్ని తక్కువ పదాల్లో వర్ణించాలంటే గాంధీ పేరు చెబితే చాలు.’’

‘‘గాంధీ విధానాల్లో కొన్ని నా ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించాయి. వాటి గురించి నేను చాలాసార్లు చెబుతుంటాను. ‘నేను నా ప్రస్తుత జీవితంపైనే దృష్టి పెడతాను. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. గతంలో జరిగిపోయిందేదో జరిగిపోయింది. జరగబోయేది మన చేతిలో లేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్నదాని మీద మనకు పూర్తి నియంత్రణ ఉంటుంది. మనమేం చేసినా దాన్ని పూర్తి అంకితభావంతో, నిబద్ధతతో చేస్తే భవిష్యత్తుపై దాని సానుకూల ప్రభావం తప్పకుండా ఉంటుంద’న్నది గాంధీ సూచించిన జీవన విధానాల్లో ఒకటి. నాకు బాగా నచ్చి అనుసరించే విధానం ఇది.’’

Image copyright DIBYANGSHU SARKAR
చిత్రం శీర్షిక ‘గాంధీ ప్రభావం నా జీవితంపైన చాలా ఉంది’

నిబద్ధతే సంపూర్ణ విజయం

‘‘నేడు ప్రపంచం ఫలితాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఒక విద్యార్థి గురించి మాట్లాడినప్పుడు మార్కుల గురించే ఆలోచిస్తున్నారు. ఒక విద్యార్థికి 90 శాతం మార్కులొస్తే గొప్ప విద్యార్థని అంటున్నారు. కానీ నా దృష్టిలో పూర్తి నిబద్ధతే సంపూర్ణ విజయం. నేను నా వైపు నుంచి అన్ని ప్రయత్నాలూ చేస్తే, మనసుపెట్టి కృషి చేస్తే, ఆ తరవాత ఫలితమెలా ఉన్నా దాన్ని అంగీకరించాలి. ఫలితాలను బట్టి ప్రయత్నాలను అంచనా వేయకూడదు. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంతే విజయం దక్కుతుంది.’’

‘‘ఒక జట్టు గురించి నేను కెప్టెన్‌గా మాట్లాడాలంటే.. నిజాయితీతో కూడిన అభిప్రాయ భేదాలు ఉండాలంటాను. జట్టు సభ్యుల ఎంపిక విషయంలో చాలాసార్లు అస్పష్టత ఉంటుంది. కొన్నిసార్లు సీనియర్ ఆటగాళ్ల సలహా తీసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు జూనియర్ ఆటగాళ్లు సలహాలిస్తుంటారు. ఒక కెప్టెన్‌గా ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ దాన్ని అంగీకరించాల్సిందేనని దానర్థం కాదు. విభేదిస్తే నిజాయితీగా అభిప్రాయం తెలపాలి.’’

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ‘భవిష్యత్తు గురించి నేనెప్పుడూ ఆలోచించను’

నిజాయితీ ముఖ్యం

‘‘కెప్టెన్‌గా కాకుండా ఒక ఆటగాడిగా మాట్లాడాలంటే... ఒక జట్టులో ఒక ఆటగాడికి బదులు మరో ఆటగాడిని ఎంచుకుంటే ఆ ఆటగాడు బాగా ఆడతాడనీ, దాని వల్ల టీం పరిస్థితి మెరుగవుతుందనీ అర్థం. అందుకే ఎవరికి ఎలాంటి అభిప్రాయ భేదాలున్నా అవి నిజాయితీగా ఉండాలని అంటాను.’’

‘‘జట్టు విషయంలో నిర్ణయాత్మక వ్యక్తితో పాటు, ఆ టీంలో ఉన్న సభ్యులందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుంటూనే నిజాయితీగా భిన్నాభిప్రాయాన్ని తెలిపే అవకాశాన్ని అందరికీ కల్పించాలి. నా దృష్టిలో అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే దాని సానుకూల ప్రభావం జట్టుపైన తప్పకుండా పడుతుంది. వ్యాపార సంస్థలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.’’

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి.. ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది

కరోనావైరస్ కేసులు: టాప్‌ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది

పాకిస్తాన్ విమాన ప్రమాదం - ‘జీవితాంతం వెంటాడుతుంది’

వైజాగ్ విమానాశ్రయంలోకి ముగ్గురు ఎల్జీ పాలిమర్స్ నిపుణులు.. దేశం దాటడానికి ఎవరైనా సహకరిస్తున్నారా

ప్రకృతి సంక్షోభం: తగ్గిపోతున్న మిడతలు, సీతాకోకచిలుకలు.. ‘కీటకాల అంతం’ ఊహించడమే కష్టం అంటున్న పరిశోధకులు

వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సహా 49 మందికి హైకోర్టు నోటీసులు

ఇందిరా గాంధీ పేరు చెప్పి, ఒక్క ఫోన్ కాల్‌తో అప్పట్లో రూ.60 లక్షలు కాజేశారు

వలస కూలీల కష్టాలపై స్పందించిన సుప్రీంకోర్టు.. సుమోటోగా విచారణ.. కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు

ప్రధానితో కాళ్లు కడిగించుకున్న పారిశుద్ధ్య మహిళలు ఈ లాక్‌డౌన్ కాలంలో ఎలా ఉన్నారు