శ్రీనగర్ బిఎస్ఎఫ్ క్యాంపుపై తీవ్రవాద దాడి

  • 3 అక్టోబర్ 2017
బిఎస్ఎఫ్ జవాను Image copyright Reuters

శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ కి దగ్గరలో ఉన్న బిఎస్ఎఫ్ క్యాంపు పై తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఒక తీవ్రవాది హతమయ్యాడు.

"దాడి పొద్దున్న 5 గంటల సమయంలో జరిగింది. బిఎస్ఎఫ్ 182 బెటాలియన్ క్యాంపులో 3 తీవ్రవాదులు చొరబడ్డారు. అందులో ఒకరిని భద్రతా దళాలు హతమార్చాయి. ఇద్దరు తీవ్రవాదులు క్యాంపులో ఉన్నారు. ఈ దాడితో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఎదురుదాడులు జరుగుతున్నాయి" అని శ్రీనగర్ పోలీస్ ఐజి మునీర్ ఖాన్ తెలిపారు.

కొద్దిసేపటి వరకూ ఎయిర్‌పోర్ట్ వైపు ఉద్యోగులను, ప్రయాణికులను, వాహనాలను అనుమతించలేదు.

ఎదురుదాడులు జరగటంతో కొద్దీ సేపటి వరకూ శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ నుండి విమాన సేవలను రద్దు చేసి ఆ తరువాత పునరుద్ధరించారు.