జోరుగా హుషారుగా: తెలుగు యువతుల సాగర యానం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

పడవలో భూమధ్య రేఖను దాటిన మహిళా కమాండోలు

  • 3 అక్టోబర్ 2017

చరిత్రలో మొదటిసారిగా భారత నేవీకి చెందిన ఆరుగురు సాహస మహిళా లెఫ్టినెంట్ కమాండర్లు ప్రపంచ యాత్ర చేస్తున్నారు. ఇప్పుడు వీరు భూమధ్య రేఖను దాటారు. తమ యాత్ర జోరుగా హుషారుగా సాగిపోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారు తమ వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

ఈ టీంలో ఉన్న ఇద్దరు తెలుగు వారిలో ఒకరు ఐశ్వర్య బొడ్డపాటి. ఈమె విజయవాడ సమీపంలోని కంకిపాడులో పుట్టారు. హైదరాబాద్‌లో పెరిగారు. ఓడను డిజైన్‌ చేయగలరు. సముద్రం మధ్యలో నౌక ఆగిపోతే వెళ్లి బాగు చేస్తారు.

ఈమెతో పాటు ఈ టీంలో మరో తెలుగమ్మాయి స్వాతి పాతర్లపల్లి కూడా ఉన్నారు.

ఈమె స్వస్థలం విశాఖ. తండ్రి పాతర్లపల్లి ఆదినారాయణ. విశాఖలోని ఎంవోవీలో హెడ్‌కుక్‌. తల్లి పాతర్లపల్లి రాణి సెయిలింగ్‌ క్లబ్‌లో కోచ్‌. రాణికి నీళ్లంటే భయం. దీంతో కూతురు కూడా అలా భయపడకూడదని. స్వాతిని సెయిలింగ్ వైపు ప్రోత్సహించారు.

ఈ ఆరుగురు 56 అడుగుల పొడవైన సరికొత్త 'ఐఎన్‌ఎస్‌వీ తరిణి'లో ఈ సాహస యాత్ర చేస్తున్నారు. మొత్తం 21,600 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణిస్తారు. చాలా చోట్ల మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

సముద్రంలో ఆటుపోట్లు వస్తే శాటిలైట్ ఫోన్‌తో సమాచారం అందిస్తారు. సమీపంలోని దేశానికి చెందిన నౌకాదళం వచ్చి రక్షిస్తుంది. వీరంతా చిన్నచిన్న ప్రయాణాలను విజయవంతంగా పూర్తి చేశారు. కానీ ఇది సాహసంతో కూడిన సుదీర్ఘ ప్రయాణం.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు