రోహింజ్యా వీడియోతో కిరీటం కోల్పోయిన మయన్మార్ బ్యూటీక్వీన్

  • 4 అక్టోబర్ 2017
ష్వే ఐన్ సీ Image copyright Shwe Eain Si
చిత్రం శీర్షిక ఒక్క ఫేస్‌బుక్ పోస్టు కిరీటాన్ని దూరం చేసింది

మయన్మార్‌లోని రఖైన్ ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్న హింసకు రోహింజ్యా మిలిటెంట్లే కారణమంటూ ఓ వీడియోని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినందుకు తన టైటిల్‌ని కోల్పోవాల్సి వచ్చిందని మిస్ గ్రాండ్ మయన్మార్‌గా ఎంపికైన ష్వే ఐన్ సీ అంటున్నారు.

‘రఖైన్ ప్రాంతంలో చెలరేగుతున్న హింసకు రోహింజ్యాలే కారణం. వాళ్లే అల్లర్లకూ, ఘర్షణలకూ ఆజ్యం పోస్తూ పరిస్థితిని హింసాత్మకంగా మారుస్తున్నారు. దాన్ని కప్పి పుచ్చుకోవడానికి మీడియా ముందు తమకు అన్యాయం జరుగుతున్నట్టు నటిస్తున్నారు’ అని విమర్శిస్తూ 19 ఏళ్ల ష్వే గత వారం ఓ వీడియోని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అందాల పోటీ కాంట్రాక్ట్‌లోని నియమాలను ష్వే ఐన్ సీ ఉల్లంఘించారనీ, అందుకే ఆమె టైటిల్‌ని వెనక్కు తీసుకున్నామనీ మిస్ మయన్మార్ పోటీల నిర్వాహకులు తెలిపారు. ఒక రోల్ మోడల్‌లా ఆమె ప్రవర్తించలేదనీ వాళ్లు పేర్కొన్నారు.

ష్వే మాత్రం చాలా చిన్న విషయాన్ని సాకుగా చూపించి తన టైటిల్‌‌ని వెనక్కి తీసుకోవడం సరికాదని అన్నారు. ఓ సెలెబ్రిటీగా తన దేశానికి సంబంధించిన ఏ విషయం గురించైనా నిజాయితీగా, నిర్భయంగా మాట్లాడే హక్కు తనకుందని చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇటిర్ ఎసెన్ (మధ్యలో) కూడా ఓ ట్వీట్ కారణంగా మిస్ టర్కీ కిరీటాన్ని కోల్పోయారు.

అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి విమర్శలూ చేయకపోయినా, అసంబద్ధమైన విషయాల గురించి మాట్లాడినందుకు ఆమెకు టైటిల్‌ని కోల్పోక తప్పలేదు.

ఆన్‌లైన్ పోస్టింగుల వల్ల అందాల కిరీటం చేజారడం ఇది తొలిసారి కాదు. గత నెలలోనే మిస్ టర్కీగా ఎంపికైన ఇటిర్ ఎసెన్ అనే అమ్మాయి, ఒక అనవసర ట్వీట్ చేసిన కారణంగా తన టైటిల్‌ని కోల్పోవాల్సి వచ్చింది. ‘మిస్ టర్కీగా’ ఎంపికైన ఇరవై నాలుగ్గంటల్లోనే ఆమె దాన్ని చేజార్చుకోవడం విశేషం.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు