టీ20: ఆసీస్‌పై భారత్ గెలుపు

  • 8 అక్టోబర్ 2017
క్రికెట్ Image copyright Getty Images

టీ20ల్లో భారత్‌కు ఆస్ట్రేలియాపై వరుసగా ఏడో విజయం. శనివారం రాంచీలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా‌పై భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది.

అంతకుముందు, మ్యాచ్‌‌కు వర్షం అంతరాయం కలిగించింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ర్టేలియా, వాన వల్ల ఆట నిలిచిపోయిన సమయానికి 18.4 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.

ఇన్నింగ్స్‌ను 18.4 ఓవర్లకు కుదించారు.

డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ లక్ష్యాన్ని ఆరు ఓవర్లలో 48 పరుగులుగా నిర్ణయించారు. భారత్ మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది.

కోహ్లీ 22 పరుగులతో, శిఖర్ ధావన్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగులు చేశాడు.

రోహిత్ ఇన్నింగ్స్ మొదటి బంతినే ఫో‌ర్‌గా మలిచాడు.

చివర్లో కోహ్లీ విన్నింగ్ షాట్‌గా ఫోర్ కొట్టాడు.

రాణించిన కుల్‌దీప్ యాదవ్

ఆసీస్‌ జట్టులో 42 పరుగులతో ఆరన్ ఫించ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరే ఆటగాడూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు.

కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఎనిమిది పరుగులకే వెనుదిరిగాడు.

భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ రాణించాడు. నాలుగు ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి, ఫించ్ వికెట్‌తోపాటు మరో వికెట్ పడగొట్టాడు.

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇది తొలి మ్యాచ్.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)