మహిళ అయినందునే మహీరాను టార్గెట్ చేశారు : రణ్‌బీర్

  • 10 అక్టోబర్ 2017
Image copyright TWITTER
చిత్రం శీర్షిక ఈ ఫొటో పైనే పాకిస్తాన్ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ఈ ఫొటో చూశారా! వివాదానికి అసలు కారణం ఇదే. న్యూయార్క్‌లో రణ్‌బీర్‌తో కలిసి మహీరాఖాన్ సిగరెట్‌ తాగుతూ కెమేరాకి చిక్కారు. ఈ ఫొటో ఫేస్‌బుక్, ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ఇదేం పని అంటూ మహీరా ఖాన్‌పై నెటిజన్లు ప్రశ్నలు సంధించారు.

బ్యాక్‌లెస్‌ డ్రెస్‌ వేసుకుని సిగరెట్‌ తాగుతూ ఉన్న ఈ ఫొటోను సెప్టెంబర్ చివర్లో ఓ వెబ్‌సైట్ ప్రచురించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇది విస్తృతంగా సర్కులేట్ అయింది. మహీరా ఖాన్‌ పాకిస్తాన్‌ను అవమానించారంటూ అక్కడి ప్రజలు మండిపడ్డారు.

'సోషల్ మీడియాలో పరిస్థితి చేయిదాటి పోయింది. మహీరా బ్యాక్‌లెస్‌ డ్రెస్, సిగరెట్ తాగడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికంటే భారతీయ నటుడితో కలిసి ఉండటం వారిలో ఆగ్రహాన్ని మరింత పెంచిందని' బీబీసీ సోషల్ మీడియా ఉర్దూ ఎడిటర్ తాహిర్ ఇమ్రాన్ అన్నారు.

అయితే, మహీరా ఖాన్‌కు రణ్‌బీర్ కపూర్ అండగా నిలిచారు. మహీరా గురించి అలా మాట్లాడటం అన్యాయమని అన్నారు. మహిళ అయినందునే ఆమెను తప్పుబడుతున్నారని చెప్పారు.

Image copyright TWITTER

నెటిజన్ల ఆగ్రహం చల్లారకపోవడంతో రణ్‌బీర్ కాస్త వెనక్కి తగ్గాడు. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరమని చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Image copyright TWITTER

పాకిస్తాన్‌లోని ప్రముఖ జర్నలిస్ట్ అస్మా షిరాజీ కూడా మహీరాఖాన్‌కు సపోర్ట్ చేశారు. ఆడవాళ్లు సిగరెట్ తాగితే తప్పు అయినప్పుడు.. మగాళ్లు తాగితే తప్పుకాదా అని ఆమె ప్రశ్నించారు. ఇది సమాజం చూపిస్తున్న ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చెప్పారు.

Image copyright PAUL J.RICHARDS
చిత్రం శీర్షిక మహిళల పట్ల ఇది కచ్చితంగా కపట ప్రేమ చూపడమే-పాకిస్తాన్ జర్నలిస్ట్

ఆమె నటించిన సినిమాలు చూస్తారు. ఎక్స్‌పోజింగ్‌ చేస్తే పడిపడి చూస్తారు. కానీ బ్యాక్‌లెస్‌ డ్రెస్‌ వేసుకుని, భారతీయ నటుడితో కలిసి సిగరెట్ తాగితే మాత్రం ఇంత గోల చేస్తారా అని అస్మా ప్రశ్నించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)