జీతే రహో 'సర్కార్' - అమితాబ్ @ 75

  • 11 అక్టోబర్ 2017
Image copyright Getty Images

భారత అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ 75వ పుట్టినరోజు ఈరోజు. 1942 అక్టోబరు 11న అమితాబ్ జన్మించారు. భారతీయ సినిమాకి చేసిన సేవలకు గుర్తింపుగా 1984లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలు ఆయన్ని వరించాయి. మరెన్నో లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు కూడా ఆయన సొంతమయ్యాయి. వీటిలో 4 జాతీయ అవార్డులు కూడా ఉన్నాయి.

అమితాబ్ అంటే కేవలం నటుడు మాత్రమే కాదు... ఓ వ్యక్తిత్వ వికాస పుస్తకం, మానవీయ విలువలకి చిరునామా, క్రమశిక్షణకి ప్రతిరూపం.. అని చాలామంది భావిస్తారు. అమితాబ్ జన్మదినం సందర్భంగా ఆయన జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఇది.

భార్య, కుమారుడు, కుమార్తెలతో...

కూర్చుని పనిచేసి అలసిపోయారా... అయితే నిలబడి పనిచేయండి.

(దీనికోసం అమితాబ్ ఓ ప్రత్యేక టేబుల్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. తన తండ్రి ద్వారా ఈ సూత్రాన్ని నేర్చుకున్నానని ఆయన చెప్తారు.)

యే దోస్తీ హమ్ నహీ ఛోడేంగే... షోలే చిత్రం షూటింగ్‌కి సిద్ధమవుతూ...

దిల్లీలో ఓ ఛారిటీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా...

ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా!

కుమారుడు అభిషేక్‌కి కొత్త గ్యాడ్జెట్‌ని పరిచయం చేస్తూ... (ఇప్పుడైతే పిల్లలే మనకు నేర్పేలా ఉన్నారు)

ప్రతి ఆదివారం సాయంత్రం తన ఇంటివద్ద చేరిన అభిమానులను కలుసుకోవడం 35 సంవత్సరాలుగా ఆయన జీవితంలో భాగమైపోయింది.

మనవరాలు ఆరాధ్యతో కలసి అభిమానులకు అభివాదం చేస్తూ...

నాడు - నేడు: రిషికపూర్, ప్రేమ్ చోప్రాలతో...

సినిమాల్లో భాగంగా...

బిగ్ బీ అంటే కేవలం స్టైల్‌ ఐకానే కాదు... బ్లడ్ కేన్సర్ బాధిత చిన్నారుల సహాయార్థం ఓ ఛారిటీ వాక్.

గాయకుడిగా...

అభిమానులు రూపొందించిన ఎలాంటి చిత్రమైనా అపురూపమే...

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు