మైనర్ భార్యతో శారీరక సంబంధంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఫొటో సోర్స్, Getty Images
మైనర్ భార్యతో శారీరక సంబంధం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
పీటీఐ వార్త ప్రకారం, 18 ఏళ్లకన్నా తక్కువ వయసున్న భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరమనీ, దీనిని రేప్‌గానే పరిగణించాలనీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
కోర్టు తీర్పు ప్రకారం, మైనర్ భార్య ఒక సంవత్సరం లోపు దీనిపై ఫిర్యాదు చేయొచ్చు.
అయితే రేప్ కేసులకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ 375లో ఉన్న ఒక మినహాయింపు ప్రకారం దాంపత్య రేప్‌ను నేరంగా పరిగణించరు. అంటే భర్త ఒకవేళ తన భార్య ఇష్టానికి విరుద్ధంగా శారీరక సంబధం పెట్టుకున్నా అది నేరం కాదు.
'దాంపత్య రేప్'కు సంబంధించిన మరో కేసులో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీనిని నేరంగా పరిగణించగూడదని ప్రకటించిన విషయం తెలిసిందే.
దిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చిన ఆ కేసులో, దీనిని 'నేరంగా పరిగణిస్తే వివాహ వ్యవస్థ అస్థిరంగా మారిపోతుంద'ని కేంద్రంగా వాదించింది. ఇది 'భర్తలను వేధించే ఒక కొత్త ఆయుధం'గా తయారవుతుందని కూడా అది తన వాదనలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- '18 ఏళ్ల లోపు వయసున్న భార్యతో సెక్స్ అత్యాచారమే'
- సోనియా గాంధీ గౌను ఇందిర రక్తంతో తడిచిపోయింది..
- చింతలవలస: డోలీలో గర్భిణి.. నడ్డిరోడ్డుపై ప్రసవం.. రాయితో బొడ్డుతాడు కోత
- గర్భస్థ పిండానికి జీవించే హక్కు లేదా?
- కోడి ముందా? గుడ్డు ముందా? క్వాంటమ్ ఫిజిక్స్‌తో సమాధానం
- వెయ్యి కిలోమీటర్ల దూరం విమానాన్ని వెంబడించిన పక్షులు
- సిగరెట్ మానేయాలనుకునే వారు ఇది చదవాలి
- ‘భారత యువత గుండె బలహీనమవుతోంది’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)