హైదరాబాద్‌పై సోషల్ మీడియాలో జోకుల వాన

  • 16 అక్టోబర్ 2017
హైదరాబాద్‌పై జోకుల వాన Image copyright NOAH SEELAM/Getty Images

ఇటీవల హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నగర జీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు జంటనగరాల రోడ్లన్నీ జలాశయాల్లా మారిపోయాయి. ప్రజారవాణా స్తంభించింది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, ఇలా ఒకరేమిటి? అందరూ బాధితులే.

దీనిపై సోషల్ మీడియాలో పేలిన జోకులు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వాన్ని విమర్శించేవి కొన్నైతే... చదువుకుని నవ్వుకునేవి మరికొన్ని.

"ర్యాలీ ఫర్ రివర్స్ ఉద్యమాన్ని హైదరాబాద్ విజయవంతం చేసింది. రోడ్లన్నీ నదులుగా మారిపోయాయి. మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు."

Image copyright Facebook

ఓ ఇంటర్వ్యూ జరుగుతోంది.

హెచ్‌ఆర్: ఈత కొట్టడం అనేది మీకున్న నైపుణ్యంగా ఎందుకు రాశారు?

అభ్యర్థి: హైదరాబాద్‌లో వర్షం పడుతున్నా సరే నేను ఆఫీసుకి రాగలను.

హెచ్‌ఆర్: గ్రేట్, మీరు ఎంపికయ్యారు.

Image copyright Twitter

హైదరాబాద్‌లో వర్షాలు పడుతున్నప్పుడు మన గమ్యం చేరుకోవడం కన్నా చంద్రుణ్ని చేరుకోవడం చాలా సులభం!

Image copyright Twitter

ప్రజలు చంద్రుడిపై నడుస్తున్న చిత్రాన్ని నాసా విడుదల చేసిందనుకున్నాం... కానీ అది కూకట్‌పల్లి రోడ్డు అని జీహెచ్‌ఎంసీ తర్వాత నిర్దరించింది.

Image copyright Facebook

ఎట్టకేలకు ఇంటికి చేరాను. అయితే ఎయిర్ బెలూన్ ఉంటే ఇంకా త్వరగా చేరుకుని ఉండేవాడిని.

Image copyright Facebook

అన్నా! రెండు పడవలు పంపించండి!

Image copyright Facebook

ఈ వర్షాలకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వరసపెట్టి సినిమాలు చూసే అవకాశం దొరికింది.

Image copyright Twitter

హైదారాబాద్‌ రోడ్లపై ప్రయాణించి ఇంటికి చేరుకున్నామంటే చాలు... మనం గొప్ప విజయం సాధించినట్లే!

Image copyright Facebook

ఇది హైదరాబాదా లేక చిరపుంజా!

Image copyright Facebook

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)