రాత్రయితే ఈ ఊళ్లో ఒక్క మగాడూ ఉండడు

  • 17 అక్టోబర్ 2017
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionరాత్రి అయితే చాలు ఆ ఊళ్లో ఇళ్లకు తాళాలు పడిపోతున్నాయి. భయంతో ఊరంతా వణికిపోతోంది.

రాత్రి అయితే చాలు ఆ ఊళ్లో ఇళ్లకు తాళాలు పడిపోతున్నాయి. భయంతో ఊరంతా వణికిపోతోంది. మగాళ్లు ఏకంగా గ్రామం విడిచిపారిపోతున్నారు.

తెలంగాణలోని నిర్మల్ జిల్లా లక్షణచాంద మండలం కాశిగూడ గ్రామంలో పరిస్థితి ఇది. మూఢ విశ్వాసాలు, దెయ్యం పుకార్లతో గ్రామస్తులు ఇలా చేస్తున్నారు.

ఈ ఊళ్లో దాదాపు 60 కుటుంబాలున్నాయి. గ్రామంలో చాలా మంది నిరక్షరాస్యులే.

మూడు నెలల వ్యవధిలో ఊళ్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మగవాళ్లు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.

అయితే ఇదంతా ఆడ దెయ్యం పనేనని గ్రామస్తులు నమ్ముతున్నారు. తమ ఊరిని దుష్ట శక్తులు ఆవహించాయని భావిస్తున్నారు.

దీంతో రాత్రి అయితే ఊళ్లో అన్ని ఇళ్లకు తాళాలు పడిపోతున్నాయి. మగాళ్లు ఏకంగా ఊరే విడిచి పారిపోతున్నారు.

ఇప్పటికే 12 కుటుంబాలు ఊరి విడిచి వెళ్లిపోయాయి. ఇక కొత్త వ్యక్తులు ఎవరూ ఊళ్లో అడుగుపెట్టడం లేదు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు