బన్నీ ఛౌ: దక్షిణాఫ్రికా మనసు దోచిన భారతీయ వంటకం

బనీ చావ్‌

దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. వారిని "డర్బన్ ఇండియన్ కమ్యూనిటీ" అంటారు. ఒకప్పుడు వీరు భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు ఒప్పంద కూలీలుగా వెళ్లిపోయారు. అప్పట్లో దక్షిణాఫ్రికాలోని చక్కెర మిల్లుల్లో వారు పనిచేసేవారని చారిత్రిక ఆధారాలు చెబుతున్నాయి.

చక్కెర మిల్లుల్లో పనిచేసే భారత సంతతికి చెందిన కార్మికులు తమకు సౌకర్యంగా ఉందని బన్నీ ఛౌను మధ్యాహ్న భోజనానికి తెచ్చేవారు. అది బ్రెడ్ రూపంలో ఉంటుంది. అందులో వివిధ రకాల కూరలు వేసుకొని తింటారు.

"బన్నీ ఛౌను ఒక రకంగా బ్రెడ్ ముక్కతో చేస్తారు. ఇందులో కూర ఉంటుంది. మీకు ఈ వంటకం భారత్‌లో దొరకదు. ఇది ఇక్కడే దొరుకుతుంది. దీని పై భాగం చాలా రుచిగా ఉంటుంది. ఇందులో క్యారెట్ సలాడ్ కూడా ఉంటుంది" అని షనల్ రాంరూప్ తెలిపారు.

ఇంతకీ ఎందుకీ పేరు?

బ్రెడ్ పై భాగాన్ని కాస్త తీసి అందులో కూరను వేస్తారు. మిల్లుల్లో పనిచేసేవారు సులభంగా దీనిని తీసుకెళ్లొచ్చు. అందుకే ఇప్పుడిది డర్బన్‌ స్ట్రీట్ ఫుడ్‌లో చేరిపోయింది.

"నేను 1947లో డర్బన్‌కు వచ్చాను. అప్పట్నుంచే ‘బన్నీ ఛౌ’ ఇక్కడ దొరికేది. భారత్ కూలీలను బనియా అనేవారు. ఈ బనియా పదంతోనే బన్నీ ఛౌ వచ్చిందని నేను నమ్ముతాను. ఇది కాక ఈ పేరుకు మరో కారణం ఉందని కూడా అంటారు. అది కూడా నిజం కావచ్చు" అని జులేఖా మాయత్ తెలిపారు.

బన్నీ ఛౌ ఒక రకంగా శాకాహారమని, ఎందుకంటే.. బనియా అనే పేరుతో పిలవబడేవారు కూడా శాకాహారులే అని షనల్ అన్నారు. అందుకే బన్నీ ఛౌలో శాకాహార కూరలు ఉంటాయని ఆమె తెలిపారు.

దీనిని ఎలా తింటారు?

బన్నీ ఛౌని చెంచా, లేదా ఫోర్క్‌కి బదులు చేతితోనే తినాలని, అలా తింటేనే దాని రుచిని ఆస్వాదించొచ్చని షనల్ అంటున్నారు. కానీ, కొందరు మాత్రం దానిని చెంచాతో కూడా తినొచ్చని అంటున్నారు. ఏదేమైనా డర్బన్‌లో నివసించే భారతీయులకు అతి ప్రియమైన ఈ బన్నీ ఛౌ మాత్రం ఇప్పుడు భారత్‌లో లేదు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)