రాముడి శోభాయాత్రలో వానరుల వేషంలో ముస్లింలు

అయోధ్యలో శోభాయాత్ర
ఫొటో క్యాప్షన్,

శోభాయాత్రలో ఐదుగురు ముస్లింలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు

భారత్‌లో మత సామరస్యానికి అద్దం పట్టే సంఘటన మరోసారి ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. దీపావళి సందర్భంగా అయోధ్యలో నిర్వహించిన రాముడి శోభాయాత్రను ఐదుగురు ముస్లింలు ముందుండి నడిపించడం చూపరులను ఆకట్టుకుంది.

ఐదు కిలోమీటర్ల పాటు సాగిన శోభా యాత్రలో ఈ ఐదుగురు ముస్లింలూ రాముడి అనుచరులైన వానర సైన్యం వేషాలను ధరించి ప్రయాణించారు. దారి పొడవునా ప్రజలు వీళ్లపైన పూల వాన కురిపించారు. ఈ ఐదుగురిలో ఒకరైన ఫరీద్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికతో మాట్లాడుతూ, తమ వంశంలో ఐదు తరాల నుంచి రాముడి శోభా యాత్రలో పాల్గొంటున్నట్లు చెప్పారు.

‘దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో శోభాయాత్రలో పాల్గొన్నాం. కానీ అయోధ్యకి రమ్మని మాకు ఆహ్వానం అందడం ఇదే తొలిసారి’ అని ఫరీద్ అన్నారు. శోభాయాత్ర ముందుకెళ్లే కొద్దీ చాలా మంది భక్తులు వీళ్ల కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటూ కనిపించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)