చీడ పీడలను ఎదుర్కోవడంలో బీటీ కాటన్ సామర్థ్యం క్షీణిస్తోందా?

మహారాష్ట్రలో గత నెల రోజుల్లో బీటీ పత్తి పంట మీద పురుగు మందులు చల్లుతూ ఆ విషప్రభావానికి లోనై 30 మంది రైతులు చనిపోయారు. ఈ విష ప్రభావానికి కారణాలు కనుగొనడానికి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ‘బాల్ వార్మ్’ (బొంత పురుగు) అనే కొత్త రకం చీడను చంపడం కోసం రైతులు అధిక మోతాదులో పురుగు మందులు వాడుతున్నారని చాలా మంది చెబుతున్నారు. బీటీ పత్తి విత్తనాలు మరింత సమర్థవంతంగా చీడపీడలను ఎదుర్కోగలిగినట్లయితే రైతుల ప్రాణాలు నిలిచివుండేవా అనేది తెలుసుకోవడానికి బీబీసీ మరాఠీ ప్రతినిధి మయూరేష్ ప్రయత్నించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)