బీబీసీ తెలుగు: నేటి ప్రధాన వార్తా కథనాలు

  • 21 అక్టోబర్ 2017
Image copyright FACEBOOK

మాధవీలత : టాలీవుడ్‌లో హీరోయిన్లకు వేధింపులు ఇలా ఉంటాయ్

"నాకు క్లోజ్ ఫ్రెండ్‌గా ఉండగలవా? ఫన్నీగా ఉందామా? ఒక్కటే జీవితం, తేలికగా తీసుకోవచ్చు కదా. అవునంటే తప్పేముంది. మీ రూంకి రావచ్చా. కొంతసేపు దగ్గరగా గడపవచ్చు కదా..'' అంటూ తెలుగు హీరోయిన్లకు వేధింపులు మొదలవుతాయని అంటున్నారు నటి మాధవీలత. ఆమె బీబీసీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ‘టాలీవుడ్‌లో హీరోయిన్లకు వేధింపులు ఇలా ఉంటాయ్!‘

Image copyright revanthreddy/facebook

రేవంత్ చేరికతో తెలంగాణలో సమీకరణలు మారుతాయా?

కాంగ్రెస్‌లో చేరికపై ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించకపోయినప్పటికీ ఇటీవల ఏపీలోని టీడీపీ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు, తెలంగాణలోని ఆయన పార్టీ సహచరులు చేసిన వ్యాఖ్యలు చూస్తే రేవంత్ పార్టీ మారడం ఖాయమనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: కాంగ్రెస్‌లో రేవంత్ చేరికపై తలెత్తుతున్న ప్రశ్నలు

Image copyright JITENDRA
చిత్రం శీర్షిక మహేశ్ ఠాకూర్

'చెప్పులతో కొట్టి, ఉమ్మిని నాకించి అవమానించారు'

బిహార్‌లో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించాడన్న కారణంతో ఒక వ్యక్తిని అగ్రవర్ణాల వారు దారుణంగా అవమానించారు.

వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ‘ఇంట్లోకి వచ్చారని.. ఉమ్మి నాకించారు’

Image copyright AFP
చిత్రం శీర్షిక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు.

ఆరు రాష్ట్రాల ఎన్నికలపైనే రెండు పార్టీల గురి

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకంటే ముందు దేశంలోని 11 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో 6 రాష్ట్రాల ఎన్నికలు అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లకు అత్యంత కీలకమైనవి. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో రెండు పార్టీలు ప్రత్యక్షంగా తలపడనున్నాయి.

వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఆరు రాష్ట్రాల ఎన్నికలపైనే రెండు పార్టీల గురి

చిత్రం శీర్షిక ’మెర్సల్‘ సినిమాలో నటుడు విజయ్ నోట వినిపించే డైలాగ్ మీద బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది

'మెర్సల్'లో జీఎస్‌టీపై విమర్శలు, బీజేపీ రుసరుసలు

''సింగపూర్‌లో కేవలం 7 శాతం జీఎస్‌టీ మాత్రమే వసూలు చేస్తారు. అయినా అక్కడ ప్రజలకు వైద్య సేవలు ఉచితంగా అందిస్తారు. కానీ ఇక్కడ 28 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు. అయినా వైద్య సేవలు ఉచితంగా అందించరు'' - ఇదేదో రాజకీయ పార్టీ ప్రముఖుల నుంచి వచ్చిన విమర్శ కాదు. 'మెర్సల్' అనే తమిళ సినిమాలో హీరో విజయ్ నోట వినిపించే డైలాగ్.

వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ‘మెర్సల్’లో జీఎస్‌టీపై విమర్శలు, బీజేపీ రుసరుసలు

Image copyright PFI
చిత్రం శీర్షిక నిర్మా దేవి

సీరియల్ చూసి గర్భనిరోధంపై చైతన్యం పొందిన బిహార్ మహిళ

భారత్‌లో గర్భనిరోధం గురించి బహిరంగంగా మాట్లాడటానికి చాలా మంది వెనకాడతారు. గర్భనిరోధక మాత్రలు వాడటానికీ సంశయిస్తారు. బిహార్ లాంటి రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు అధిక సంతానానికి దారితీస్తున్నాయి. అయితే బిహార్ గ్రామీణ ప్రాంతాల్లో ఒక టీవీ సీరియల్ కుటుంబ నియంత్రణపై చర్చ జరిగేలా చేస్తోంది.

వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: టీవీ సీరియల్ తెచ్చిన చైతన్యం

సముద్రంలో దీపావళి జరుపుకున్న నేవీ మహిళల బృందం

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఇటీవల పడవలో ప్రపంచ యాత్రకు బయల్దేరిన నావికాదళ మహిళా కమాండోలు ఇప్పుడు భూమధ్య రేఖను దాటారు.

రిఫరీ కళ్లతో ఫుట్‌బాల్ చూస్తారా?

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఫుట్‌బాల్ మైదానంలో రిఫరీ దృష్టికోణమిదీ

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు