మనుగడకై మనుషులతో గజరాజుల పోరు
మనుగడకై మనుషులతో గజరాజుల పోరు
తూర్పు, మధ్య భారతదేశంలో భారీ పరిశ్రమలు, మైనింగ్ కారణంగా 'ఎలిఫెంట్ కారిడార్' తగ్గిపోతోంది. దీని ఫలితంగా ఏనుగులు సమీపంలోని గ్రామాలపై పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. మనుగడ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ఇప్పటివరకు 1,500కు పైగా ప్రజలు, 400కు పైగా ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. కెమెరాపర్సన్ డెబ్లిన్‌తో కలిసి బీబీసీ కరస్పాండెంట్ సల్మాన్ రావి అందిస్తున్న ఈ కథనం మనుగడ కోసం మానవులతో ఏనుగుల పోరాటాన్ని కళ్లకు గడుతుంది.