డబ్ల్యుడబ్ల్యుఈలో పాల్గొన్న  మహిళా రెజ్లర్ కవితా దేవి
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

కవితా దేవి: డబ్ల్యుడబ్ల్యుఈలో తొలి భారతీయ మహిళ

  • 26 అక్టోబర్ 2017

భారత్ తరఫున డబ్ల్యుడబ్ల్యుఈలో పాల్గొన్న మొట్టమొదటి మహిళా రెజ్లర్ కవితా దేవి. మొదట్లో కుటుంబ స‌భ్యులు ఆమెకు స‌హ‌క‌రించ‌లేదు. రెజ్లింగ్ పురుషుల క్రీడ అనేవారు.

అయినా ఆమె పట్టుదలను వీడలేదు. దాంతో కుటుంబ సభ్యులే క్రమంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

అందుకే పెళ్లై, కొడుకు పుట్టాక కూడా తన కలల క్రీడను వొదులుకోలేదు కవిత. 'సౌత్ ఏషియా గేమ్స్'లో వెయిట్ లిఫ్టింగ్‌లో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారామె.

డబ్ల్యుడబ్ల్యుఈలో తలపడుతున్న ఏకైక భారతీయ మహళ 34 ఏళ్ల కవితా దేవి మాత్రమే. ప్రముఖ భారతీయ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ వద్ద కఠోర శిక్షణ తీసుకుంటున్నారు.

భార‌తీయ‌ మ‌హిళా శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిచెప్పిన ఆమె బీబీసీ ప్రతినిధి సుమిరన్తో మాట్లాడారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)