చీకటవగానే చీర కట్టేస్తాడు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

పగటి పూట పురుషుడు, రాత్రి పూట స్ర్తీ

  • 26 అక్టోబర్ 2017

ఓ స్త్రీ విద్యుత్ వెలుగుల్లో డాన్స్ చేస్తోంది. సిగ్గు పడుతోంది. కవ్విస్తోంది. నవ్విస్తోంది. ఆమె చుట్టూ పురుషులు గుంపుగా మూగారు. కానీ ఆమె ఆమె కాదు. అతడు.. స్త్రీ కాదు.. పురుషుడు.

బిహార్ లో ఇదో సంప్రదాయం. అంతరించిపోతున్న కళ. వీరిని ‘లోండా’ అంటారు. ఈ వృత్తి నుంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తూ, ఓడుతూ.. ఒడిదుడుకులు పడుతున్న యువకుడు లలిత్ కుమార్ కథ ఇది.

ఇతడు డిగ్రీ పూర్తిచేశాడు. ఉద్యోగాల కోసం కోచింగ్ కూడా తీసుకుంటున్నాడు. పగలంతా కోచింగ్ సెంటర్లో ఉంటాడు. రాత్రి పూట పురుషుల గుంపు మధ్య, లైట్ల వెలుగుల్లో డాన్స్ చేస్తాడు. వీరిలో కొంతమందికి సంపాదన బాగున్నాతగిన గౌరవం మాత్రం దక్కదు.

‘మాకు దక్కే గౌరవం బానిసల పట్ల సమాజానికి ఉండే గౌరవం’ అని లోండా జీవితం నుంచి బయటకు వచ్చిన బనారసి లాల్ చెబుతున్నారు.

లలిత్ కుమార్‌ది ఆకలి సమస్య. ఆత్మగౌరవ సమస్య. ఈ సమస్య ఇతని ఒక్కడిదే కాదు.. బిహార్‌లో ఉన్న చాలామంది ‘లోండా’లది. ఏదో ఓ ఉద్యోగం సంపాదించి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందాలన్నది లలిత్ కోరిక.

బీబీసీ ప్రతినిధి సీతు తివారి అందిస్తున్న కథనం.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు