ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల అదుపులో సీనియర్ జర్నలిస్ట్ వినోద్ వర్మ

  • 27 అక్టోబర్ 2017
వినోద్ వర్మ, ఛత్తీస్‌గఢ్ Image copyright Facebook

ఛత్తీస్‌గఢ్ పోలీసులు గురువారం రాత్రి సీనియర్ జర్నలిస్ట్ వినోద్ వర్మను ఘజియాబాద్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం ఆయనను ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించి కొన్ని గంటల పాటు విచారించారు.

రాయపూర్ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గురువారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో వినోద్ వర్మ ఇంటికి వెళ్లి, ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌ కంట్రోల్ రూం జర్నలిస్ట్ సమీర్ ఆత్మజ్ మిశ్రాకు తెలిపింది.

రాయ్‌పూర్‌లోని పండరి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైనట్లు ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బీబీసీ ప్రతినిధి సరోజ్ సింగ్‌కు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

వినోద్ వర్మ ఇంటి నుంచి సుమారు 500 సీడీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

సెక్షన్ 384 (అక్రమ వసూళ్లు), సెక్షన్ 506 (హతమారుస్తాననే బెదిరింపులు) కింద ఆయనపై కేసులు నమోదు చేశారు.

వినోద్ వర్మ గతంలో బీబీసీ ప్రతినిధిగా పని చేశారు. ఆయన అమర్ ఉజాలా డిజిటల్ ఎడిటర్‌గా కూడా పని చేశారు.

ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యులైన వర్మ చాలా కాలంగా ఛత్తీస్‌గఢ్‌లోని సామాజిక సమస్యలపై వార్తలు రాస్తున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)