విధి ఎప్పుడు తలిస్తే అప్పుడే నా పెళ్లి: రాహుల్

  • 27 అక్టోబర్ 2017
రాహుల్ గాంధీ Image copyright Getty Images

రాహుల్ గాంధీ పెళ్లి .. ఎప్పుడూ హాట్ టాపిక్కే. గతంలో రాహుల్ ఒక యువతితో కలిసి ఉన్న ఫొటోపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. కొన్నిసార్లు ప్రజా వేదికలపైనే ఈ ప్రశ్న సంధిస్తుంటారు.

తాజాగా, ఓ సమావేశంలో రాహుల్ మళ్లీ ఈ ప్రశ్నను ఎదుర్కొన్నారు. ఈసారి ఆ ప్రశ్న వేసింది ప్రముఖ అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్.

గురువారం ఢిల్లీలో జరిగిన 'పీహెచ్‌డీ యాన్యువల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమంలో రాహుల్ గాంధీని క్రీడల గురించి, ఆయన పెళ్లి గురించి విజేందర్ ప్రశ్నించారు.

''రాహుల్ భయ్యా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో అని నేను, నా భార్య ఎప్పుడూ మాట్లాడుకుంటుంటాం. ఇంతకూ అదెప్పుడు?'' అని అడిగారు.

Image copyright Getty Images

‘విధి ఎప్పుడు తలిస్తే అప్పుడు’

దీనికి జవాబుగా రాహుల్, ''నేను విధిని నమ్ముతాను. ఎప్పుడు కావాలని ఉందో అప్పుడే అవుతుంది'' అని జవాబిచ్చారు.

దేశంలో క్రీడాభివృద్ధి గురించి కూడా విజేందర్ సింగ్ రాహుల్‌ను ప్రశ్నించారు.

''నేను రిబ్బన్‌ కత్తిరించే ఎమ్మెల్యేలను, ఎంపీలను చూశాను కానీ ఎవరూ ఆటలు ఆడగా చూడలేదు. ఒకవేళ మీరు ప్రధాని అయితే, క్రీడాభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు?'' అని ప్రశ్నించారు.

Image copyright Getty Images

దీనికి జవాబుగా రాహుల్ గాంధీ చాలా తక్కువ మందికి తెలిసిన ఒక విషయాన్ని వెల్లడించారు.

''మీరు క్రీడల గురించి చెప్పిన వారిలో నేను మాత్రం నేను. నాకు ఐకిడో మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ ఉంది. నేను కనీసం రోజుకు గంటైనా ఆటలు ఆడతాను'' అని వివరించారు.

రాహుల్ తన క్రీడలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాలని విజేందర్ కోరారు.

దీనికి ప్రతిగా రాహుల్.. తప్పకుండా ఆ పని చేస్తానని హామీ ఇచ్చారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు