పజిల్ 7: ఆవులిస్తే పేగులు లెక్కించగలరా?

  • 30 అక్టోబర్ 2017
క్వీన్ ఆఫ్ హార్ట్స్‌ Image copyright Getty Images

పజిల్ 7

క్వీన్ ఆఫ్ హార్ట్స్ ఇంట్లో తినుబండారాలను ఎవరో తినేశారు!

ఆ పని చేసినవాళ్లు నిజం చెప్పరు అనే విషయం ఆమెకు తెలుసు.

ఇంట్లో ఉన్న ఐదుగురినీ దీని గురించి అడిగారు. వారు చెప్పిన సమాధానాలు చూడండి.

మొదటి వ్యక్తి : 'మాలో ఒక్కడే వాటిని తిన్నాడు'

రెండో వ్యక్తి : 'మాలో ఇద్దరు వాటిని తిన్నారు'

మూడో వ్యక్తి : 'మాలో ముగ్గురు వాటిని తిన్నారు'

నాలుగో వ్యక్తి : 'మాలో నలుగురు వాటిని తిన్నారు'

ఐదో వ్యక్తి : 'మాలో ఐదుగురు వాటిని తిన్నారు'

వీరిలో ఎంతమంది నిజాయతీపరులు? ఎంతమంది నిజం చెబుతున్నారు?

ఇప్పుడు చెప్పండి ఎవరు తిన్నారో !

సమాధానం కష్టంగా ఉందా.. అయితే క్లిక్ చేయండి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఈ పజిల్‌ను పరిష్కరించండి

సమాధానం

సరైన సమాధానం ఏమిటంటే కేవలం నాలుగో వ్యక్తే నిజం చెప్పాడు.

మీరు సమాధానం కోసం ఎన్నో విధాలుగా ఆలోచించే ఉంటారు. కానీ ఈ పజిల్‌ని ఇలా అర్థం చేసుకోండి.

అందరూ భిన్నమైన సమాధానాలిచ్చారు కాబట్టి లాజికల్‌గా ఆలోచిస్తే వీరందరిలో ఒక్కరి మాటే నిజమయ్యే అవకాశముంది.

అంటే వారిలో ఒక్కరే నిజం చెబుతున్నారని అర్థం.

వారిలో ఒక్కరు మాత్రమే నిజం చెబుతున్నారంటే మిగిలిన నలుగురూ అబద్ధం చెబుతున్నారన్నట్లే కదా. అంటే నలుగురు ఆ పదార్థాలను తిన్నారన్నమాట. అంటే నాలుగో వ్యక్తి నిజం చెబుతున్నాడని అర్థం.

ఒకవేళ ఐదుగురూ అబద్ధం చెబుతున్నారంటే, ఐదుగురూ వాటిని తిన్నారని అర్థం. ఈ రకంగా చూస్తే ఐదో వ్యక్తి చెప్పిన మాట నిజమవుతుంది.

కానీ ఇక్కడ అలా లేదు. ఎందుకంటే ఇక్కడ ఐదుగురిలో కేవలం ఒక్కరు (నాలుగో వ్యక్తి) మాత్రమే నిజం చెబుతున్నాడు కాబట్టి.

ఈ పజిల్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఎన్ఆర్ఐసీహెచ్ ప్రాజెక్ట్ ద్వారారూపొందించింది.

వి కూడా ప్రయత్నించండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)