తెలంగాణ తిరుపతి: జనులను ఆకట్టుకుంటున్న కురుమూర్తి జాతర

పేదల తిరుపతి, తెలంగాణ తిరుపతిగా పిలిచే కురుమూర్తి జాతర మహబూబ్‌నగర్ జిల్లాలో ఉత్సాహంగా జరుగుతోంది. కురుమూర్తి క్షేత్రానికి, తిరుమలకు ఎన్నో పోలికలున్నాయి. తెలంగాణలో సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత ఇదే పెద్ద ఉత్సవమని స్థానికులు చెబుతారు.

కురుమూర్తి బ్రహ్మోత్సవాలు

ఫొటో సోర్స్, VIJAYABHASKAR

ఫొటో క్యాప్షన్,

మహబూబ్‌నగర్ జిల్లా సీసీకుంట మండలం అమ్మాపూర్‌లో ఏడు కొండల మధ్య కురుమూర్తి వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ప్రతీ ఏడాది ఇక్కడ నెల రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

ఫొటో సోర్స్, VIJAYABHASKAR

ఫొటో క్యాప్షన్,

శేషాద్రి , ఏకాద్రి , కోటగట్టు, ఘనాద్రి, భల్లూకాద్రి, పతగాద్రి, దేవతాద్రి అనే ఏడు కొండల్లో దేవతాద్రి అని పిలిచే దేవరగట్టుపై కురుమూర్తి ఆలయం ఉంది.

ఫొటో సోర్స్, VIJAYABHASKAR

ఫొటో క్యాప్షన్,

కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల మహోత్సవం ప్రధానమైంది. ఉద్దాలు అంటే స్వామివారి పాదుకలు అని అర్థం.

ఫొటో సోర్స్, VIJAYABHASKAR

ఫొటో క్యాప్షన్,

కురుమూర్తి ఆలయానికి దళితులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆవు చర్మంతో స్వామి వారి పాదుకలను దళితులే తయారు చేస్తారు. ఉద్దాల మండపంలో దళితులే అర్చకులు.

ఫొటో సోర్స్, VIJAYABHASKAR

ఫొటో క్యాప్షన్,

అనంతరం పాదుకలను ఊరేగింపుగా కురుమూర్తి ఆలయానికి తీసుకెళ్తారు. భక్తులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటారు.

ఫొటో సోర్స్, VIJAYABHASKAR

ఫొటో క్యాప్షన్,

కురుమూర్తి పుష్కరిణిలో స్నానాలు చేసి తడిదుస్తులతో కొండపైకి వెళ్లి దేవుడిని దర్శించుకుంటారు. మట్టికుండల్లో నైవేధ్యం సమర్పిస్తారు.

ఫొటో సోర్స్, VIJAYABHASKAR

ఫొటో క్యాప్షన్,

బ్రహ్మోత్సవాల్లో స్థానికుల నృత్యాలు ఆకట్టుకుంటాయి.

ఫొటో సోర్స్, VIJAYABHASKAR

ఫొటో క్యాప్షన్,

తిరుమల, కురుమూర్తి ఆలయాలకు మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. తిరుమల లాగానే ఇక్కడా వినాయకుడి విగ్రహం లేదు. తిరుమల మాదిరిగానే ఇక్కడా ఏడు కొండల మధ్య దేవాలయం ఉంది. తిరుమల మెట్ల దారిపై శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడా ఉన్నాయి. కురుమూర్తి దర్శనానికి వెళ్తున్నప్పుడు మోకాళ్ళ గుండు ఉంది. అలిపిరి మండపంలాగే ఇక్కడ ఉద్దాల మండపం ఉంది.

ఫొటో సోర్స్, VIJAYABHASKAR

ఫొటో క్యాప్షన్,

కురుమూర్తి క్షేత్రంలో 'సీకులు' ప్రత్యేక ఆకర్షణ. గుట్ట కింద జోరుగా మాంసం విక్రయాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో 500 మందికి ఉపాధి లభిస్తుంది. 3 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని చెబుతారు.

ఫొటో సోర్స్, VIJAYABHASKAR

ఫొటో క్యాప్షన్,

తెలంగాణ తిరుపతిగా, పేదల తిరుపతిగా పిలిచే ఈ క్షేత్రాన్ని యాదాద్రి ఆలయ స్థాయిలో అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.