నోబెల్ కోసం ఐదుసార్లు నామినేట్ అయిన హోమీ జహంగీర్ భాభా

భారత అణు కార్యక్రమ పితామహుడిగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభా 108వ జయంతి నేడు. ఆయనకు సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, పుస్తకాలంటే కూడా ఇష్టం.

హోమీ జహంగీర్ భాభా
ఫొటో క్యాప్షన్,

పేరొందిన శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ తన సహచర శాస్త్రవేత్తల్ని ఎక్కువగా పొగిడేవారు కాదు. కానీ, హోమీ భాభాను ఆయన ‘భారత లియోనార్డో డావిన్సీ’ అని పిలిచేవారు.

ఫొటో క్యాప్షన్,

భాభాకు శాస్త్ర సంబంధిత విషయాలతో పాటు సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, పుస్తకాలంటే కూడా ఇష్టం.

ఫొటో క్యాప్షన్,

‘తన చిత్రంతో పాటు (ఎం.ఎఫ్) హుస్సేన్ స్కెచ్ కూడా భాభా గీశారని మృణాళిని సారాబాయి నాకు చెప్పారు’ అని భాభాపై పుస్తకం రాసిన ఇందిరా చౌధరి తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

‘57 సంవత్సరాల వయస్సులోనే భాభా సాధించినన్ని విజయాలను మరెవ్వరూ సాధించలేకపోయారు’ అని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చిలో భాభాతో పాటు కలసి పనిచేసిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ యశ్‌పాల్ చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

‘టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ప్రతి బుధవారం అకడెమిక్ కాంగ్రెస్ జరిగేది. ఏ ఒక్క సమావేశానికీ ఆయన గైర్హాజరయ్యేవారు కాదు. ఇందులోనే చాలామందిని ఆయన కలుసుకునేవారు. ఏం జరుగుతోంది? ఏం జరగటం లేదు? అనేవి తెలుసుకునేవారు’ అని యశ్‌పాల్ చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

జవహర్‌లాల్ నెహ్రూకు భాభా అత్యంత సన్నిహితుడు. భాభాను నెహ్రూ ‘సోదరా’ అని పిలిచేవారని అంటుంటారు.

ఫొటో క్యాప్షన్,

‘కేవలం ఇద్దర్ని మాత్రమే నెహ్రూ ‘సోదరా’ అని పిలిచేవారు. అందులో ఒకరు జయప్రకాశ్ నారాయణ్ కాగా మరొకరు భాభా’ అని ఇందిరా చౌధరి అంటారు.

ఫొటో క్యాప్షన్,

‘మేం ఒకసారి డెహ్రడూన్‌ సర్క్యూట్ హౌస్‌లో బస చేశాం. అక్కడ కనిపించిన ఒక మొక్క భాభాను బాగా ఆకర్షించింది. దాన్ని పెంచుకుంటానని ఆయన అన్నారు. అది పెరగటానికి వందేళ్లు పడుతుందని నేను చెప్పాను. దీనికాయన స్పందిస్తూ.. అయితే ఏంటి? మనం అప్పటి వరకూ బతకకపోవచ్చు. కానీ, మొక్కలు బతుకుతాయి కదా! ఈ చుట్టుపక్కల మొక్కల్ని చూసి మనం ఆనందిస్తున్నట్లే మనం నాటే మొక్కల్ని చూసి భవిష్యత్ తరాలు ఆనందిస్తాయి’ అని భాభా తనతో అన్నారని ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంజీకే మేనన్ తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

‘టాటా ఇన్‌స్టిట్యూట్‌లో ఒక గార్డెన్ ఉంది. దాని పేరు అమీబా గార్డెన్. దీన్ని రూపొందించింది, మొత్తం ఇన్‌స్టిట్యూట్ పచ్చగా, అందంగా ఉండేలా చేసిందీ భాభాయే’ అని ఇందిరా చౌధరి చెబుతారు.

ఫొటో క్యాప్షన్,

‘ఈ ప్రపంచంలో నేను కలిసిన ముగ్గురు గొప్ప వ్యక్తుల్లో హోమీ భాభా ఒకరు. మిగతా ఇద్దరు జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ‌’ అని భాభాకు శ్రద్ధాంజలి ఘటిస్తూ జేఆర్‌డీ టాటా అన్నారు.