కిదాంబి శ్రీకాంత్: స్టార్ షట్లర్లు బ్యాడ్మింటన్‌ కోచ్‌లుగా మారాలి

  • 31 అక్టోబర్ 2017
కిదాంబి శ్రీకాంత్ Image copyright Getty Images

చైనా, ఇండొనేసియా లాంటి ఇతర దేశాల్లోలాగా భారత్‌లోనూ స్టార్ ఆటగాళ్లు కెరీర్ పూర్తయిన తర్వాత కోచ్ అవతారమెత్తాలని అంటున్నారు బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్.

వరుస విజయాలు.. వరుస సూపర్ సిరీస్ టైటిళ్లతో దూసుకుపోతున్న కిదాంబి శ్రీకాంత్ మంగళవారం బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్‌తో ఫేస్‌బుక్ లైవ్లో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకూ సమాధానాలు ఇచ్చారు.

ముఖ్యంగా కోచ్‌ల అంశంపై మాట్లాడుతూ.. భారత్‌కూ దేశీయ కోచ్‌లు పెరగాలని అభిప్రాయపడ్డారు.

ఇప్పటి వరకు మనకు స్టార్ కోచ్ గోపీ చంద్ ఒక్కరే ఉన్నారని ఆయన ఆధ్వర్యంలో స్టార్లయిన వారు భవిష్యత్తులో కోచ్‌ అవతారమెత్తితే భారత్‌కు మెరుగైన క్రీడాకారులు వస్తారని అన్నారు.

చిత్రం శీర్షిక బీబీసీ తెలుగు లైవ్‌లో మాట్లాడుతున్న శ్రీకాంత్

ఇక బ్యాడ్మింటన్‌ను క్రికెట్‌తో పోల్చడం సరికాదని చెప్పారు. ప్రతి ఆటా దేనికదే ప్రత్యేకమన్నారు.

ప్రస్తుతం బ్యాడ్మింటన్‌కి దేశంలో ఆదరణ పెరుగుతోందని భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని తెలిపారు.

అకాడమీ ఏర్పాటు ప్రస్తావన తీసుకురాగా.. పదేళ్ల పాటు తనకు కెరీరే ముఖ్యమని తర్వాతే ఆ ఆలోచన చేస్తానని చెప్పారు.

ప్రస్తుతం క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం బాగుందని.. అన్ని క్రీడలూ అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.

ఇప్పుడు తన టార్గెట్ చైనా ఓపెనే అని తర్వాత ఒలింపిక్స్ గురించి ఆలోచిస్తానని వివరించారు.

కిదాంబి శ్రీకాంత్ పూర్తి లైవ్‌ను ఇక్కడ చూడొచ్చు.

మరిన్ని లైవ్‌లకు సంబంధించిన అప్‌డేట్స్, ఆసక్తికర వార్తలు, కథనాలను ఫేస్‌బుక్‌ ఫీడ్ ద్వారా అందుకోవాలంటే BBCnewsTelugu పేజీని లైక్ ‌చేయండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు