3 రోజుల్లో 3 వేల మంది హత్య 33 సంవత్సరాల క్రితం ఘటన

అది మూడు రోజుల మారణహోమం.. మూడు వేల మంది సిక్కులను ఊచకోత కోశారు.

33 సంవత్సరాల క్రితం దిల్లీ వీధులు రక్తసిక్తమయ్యాయి. 1984 అక్టోబర్ 31న భారత ప్రధాని ఇందిరా గాంధీని ఆమె బాడీగార్డులు కాల్చి చంపారు.

ఈ వార్త దిల్లీలో దావానంలా వ్యాపించింది. ఇందిరను చంపిన బాడీగార్డులు సిక్కులని తెలియడంతో ప్రతీకారంగా దిల్లీలోని సిక్కులపై దాడులు ప్రారంభమయ్యాయి.

వారి ఆస్తులను ధ్వంసం చేశారు. 3వేల మందిని హతమార్చారు.

దీంతో వేల మంది సిక్కులు నిరాశ్రయులుగా మిగిలారు. ఈ మారణ హోమం 3 రోజుల పాటు సాగింది.

ఇవి కూడా చదవండి