నకిలీ వాట్సాప్ యాప్‌ను తొలగించిన ప్లేస్టోర్

ఫొటో సోర్స్, AFP
రియల్ వాట్సాప్‌ను వంద కోట్ల మందికిపైగా డౌన్లోడ్ చేసుకున్నారు
ఒకడు గూగుల్ ప్లే స్టోర్‌ని.. పది లక్షల మంది ఆండ్రాయిడ్ వినియోగదారులను బోల్తా కొట్టించాడు.
నకిలీ వాట్సాప్ యాప్‌ను సృష్టించి ప్లే స్టోర్‌లో పెట్టాడు. తయారీ దారు కూడా ‘వాట్సాప్ ఐఎన్‌సీ’ అని వాట్సప్ కంపెనీ పేరులో కొన్ని మార్పులు చేసి పెట్టాడు.
ఇంకే ముంది చాలా మంది ఇది అసలైన వాట్సాప్ అని అనుకున్నారు.
పది లక్షల సార్లకుపైగా దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు.
చివరకు ఇది నకిలీదని గూగుల్ ప్లేస్టోర్ గుర్తించి.. దాన్ని పేస్టోర్ నుంచి తొలగించింది.
ఈ యాప్ వల్ల అసలైన వాట్సాప్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ కొందరు ఏది అసలో ఏది నకిలీనో అర్థంకాక కాస్త తికమకపడినట్లు టెక్ నిపుణులు తెలిపారు.
గతంలోనూ ప్లేస్టోర్ ఇలాంటి నకిలీ యాప్‌లను తొలగించింది.
అయితే నకిలీ వాట్సాప్ ని 10 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం గమనార్హం.