కాబూల్: టీవీ స్టేషన్‌లో కాల్పుల మోత

వీడియో క్యాప్షన్,

Afghan security used explosives to reach the TV station attackers

అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్లో సాయుధులు టెలివిజన్ స్టేషన్లో కాల్పులకు దిగారు. ఈ ఘటనలో కనీసం ఇద్దరు చనిపోయారు.

పోలీసుల్లాగా మారువేషం వేసుకున్న ముగ్గురు సాయుధులు శంషాద్ టీవీ బిల్డింగ్‌పై బాంబులతో దాడి చేశారని పోలీసులు తెలిపారు.

ఈ సంఘటనలో ఒక గార్డు, దాడికి పాల్పడిన సాయుధుల్లో ఒకరు చనిపోయారని భావిస్తున్నారు. గాయాల పాలైన మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

భద్రతా సిబ్బంది సహాయక చర్యల అనంతరం ఛానెల్ ప్రసారాలు పున: ప్రారంభం అయ్యాయి.

ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ ప్రకటించుకుంది.

‘‘ఇది మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడి. అయినా వాళ్లు మా గొంతు నొక్కలేరు’’ అని స్టేషన్ న్యూస్ డైరెక్టర్ అబిద్ ఎహ్‌సాస్ మరొక ప్రైవేటు వార్తా ఛానెల్ టోలో న్యూస్‌తో అన్నారు.

శంషాద్ టీవీ పాస్తో భాషలో వార్తలు, వర్తమాన వ్యవహారాలు, ఇతర కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. బీబీసీ భాగస్వామ్య స్టేషన్లలో ఇది ఒకటి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

టీవీ స్టేషన్ వద్ద ఉద్ర్తిక్త పరిస్థితి

కాబూల్లో ఇటీవల తాలిబన్లు, ఐఎస్ దాడులు పెరిగాయి.

జర్నలిస్ట్‌లు, మీడియాకు అతి ప్రమాదకరమైన దేశాల్లో అఫ్గానిస్తాన్ ఒకటి.

మే నెలలో కాబూల్లో జరిగిన భారీ ఆత్మాహుతి దాడిలో బీబీసీ డ్రైవరు సహా 150 మంది చనిపోయారు.

గతేడాది ఓ ప్రైవేటు టీవీ స్టేషన్‌కు చెందిన ఏడుగురు సిబ్బంది తాలిబన్ల ఆత్మాహుతి దాడిలో చనిపోయారు.

అఫ్గానిస్తాన్ జర్నలిస్టుల భద్రతా కమిటీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో.. జర్నలిస్టులపై హింసకు సంబంధించి 73 కేసులు నమోదయ్యాయి. 2016తో పోలిస్తే 35 శాతం పెరిగాయి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)