ఇన్నారెడ్డి: అనాథలకు తండ్రిగా స్థిరపడ్డ మాజీ నక్సలైట్‌

ఇన్నారెడ్డి: అనాథలకు తండ్రిగా స్థిరపడ్డ మాజీ నక్సలైట్‌

రిపోర్టర్ - బళ్ల సతీశ్‌; షూట్ ఎడిట్ - కె నవీన్ కుమార్.

‘మా ఇల్లు ఆశ్రమం' ఒక అనాథాశ్ర‌మం. కానీ ఇందులో ఎక్కడా ఆ పేరు రాసి ఉండదు. ఇక్కడ ఉండేవారెవరికీ అలా అనిపించదు కూడా. ఎందుకంటే.. ఇది అనాథలకు సొంతిల్లు కావాలని ఇన్నారెడ్డి ఆ పేరు పెట్టారు.

అంతేకాదు అక్క‌డ పిల్ల‌లంద‌రూ ఇన్నారెడ్డినీ, ఆయ‌న భార్య పుష్ప‌రాణిని మ‌మ్మీ, డాడీ అనే పిలుస్తారు. ఇన్నారెడ్డి దంప‌తులు కూడా అనాథాల‌తో పాటూ అదే ఆశ్రమంలో ఉంటూ పిల్ల‌ల బాగోగులు చూస్తారు. 2006లో 32 మంది పిల్ల‌ల‌తో మొద‌లైన ఈ ఆశ్ర‌మం ఇప్పుడు 220 మందిని త‌న‌ ఒడిలో చేర్చుకుని ఆద‌రిస్తోంది.

"మీరు ఎక్క‌డికి వెళ్తారు అంటే ఇంటికి అని చెబుతాం. మ‌న ఇంటికి వెళ్ల‌డం అనేది ఒక అద్భుత‌మైన భావ‌న. ఈ పిల్ల‌ల‌కు ఆ లోటు ఉండ‌కూడ‌ద‌నే ఆశ్ర‌మానికి మా ఇల్లు అనే పేరు పెట్టాం'' అని వివరిస్తారు ఇన్నారెడ్డి. ''వీరిలో కొంత‌మందికి వారి త‌ల్లితండ్రులు, ఇంటి పేరు తెలుసు. కొంద‌రికి తెలీదు. రికార్డుల్లో స‌మ‌స్య‌లు రాకుండా ఉండ‌డం కోసం దాదాపు 40 మందికి నా ఇంటి పేరే పెట్టాను. వారికి భ‌విష్య‌త్తులో మంచి అవ‌కాశాలు రావ‌డం కోసం షెడ్యూల్డు కులంగా గుర్తింపు ఇప్పిస్తున్నాను" అని ఆయన వెల్లడించారు.

పూర్తి కథనం..

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)