‘సముద్రమంత చెత్త’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ప్లాస్టిక్ చెత్తకు చిరునామాగా మారిన కరీబియన్ సముద్రం

  • 9 నవంబర్ 2017

హోండురస్, గాటెమాలా దేశాల మధ్య ఉన్న కరీబియన్ సముద్రంలో కొన్ని మైళ్ల మేర ప్లాస్టిక్ చెత్త పేరుకుపోయింది. సముద్ర జీవులకు ఇది ప్రాణ సంకటంగా మారుతోంది.

ఆ చెత్తకు కారణం మీరంటే మీరని రెండు దేశాలూ పరస్పరం నిందించుకుంటున్నాయి. బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ కారొలిన్ పవర్ ఆ వ్యర్థాల కుప్పను తన కెమెరాలో బంధించారు.

ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇది ఇలానే కొనసాగితే జలచరాల ఉనికికే ప్రమాదమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)